Advertisementt

నందమూరి తారక రత్న సారధి!

Mon 19th Oct 2020 08:09 PM
saradhi movie,taraka rathna,saradhi movie stills  నందమూరి తారక రత్న సారధి!
Saradhi completes the shooting except for one schedule! నందమూరి తారక రత్న సారధి!
Advertisement
Ads by CJ

సారధి ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి! 

పంచభూత క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సారధి చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో హీరోగా నందమూరి తారక రత్న,  హీరోయిన్ గా  కోన శశిత నటిస్తున్నారు. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ గతంలో ఖోఖో నేపథ్యంలో రథేరా నిర్మించాం. జనవరిలో విడుదల అయిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసి.. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి నాన్న.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని అభినందించారు. ఈ సినిమా కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఖోఖో నేపథ్యంలోనే తారక రత్నతో సారధి సినిమా తీస్తున్నాం. ఇందులో తారక రత్న డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. కావున మీరందరూ ఆదరించాలి. ఈ చిత్రం ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఇటీవల కడపలో తీసిన షెడ్యూల్ తో  సినిమా ప్రధాన షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఇంకో షెడ్యూల్ మిగిలుంది. కరోనా సమయంలో కూడా తారక రత్న ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకు చిత్ర టెక్నీషియన్ బృందం ఎంతో ఋణ పడి ఉంది. త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తి చేసి మీ ముందుకు వస్తాం అన్నారు.

తారాగణం: సిద్దేశ్వర రావు, కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ, జబీర్ వెంకట్, ఫరీద్, దేవా, జై, మునీస, మధు, జమాల్ తదితర నటీనటులు.

మ్యూజిక్ డైరెక్టర్: సిద్ధార్థ వాటికన్. ప్రొడ్యూసర్స్: నరేష్ యాదవ్. పి.,  వై.ఎస్. కృష్ణమూర్తి, పి. సిద్దేశ్వర రావు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  జాకట రమేష్.

Saradhi completes the shooting except for one schedule!:

Saradhi completes the shooting except for one schedule!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ