Advertisementt

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: బీట్స్ అఫ్ రాధేశ్యాం!!

Fri 23rd Oct 2020 02:08 PM
radhe shyam,prabhas,birth day special,beats of radhe shyam  ప్రభాస్ బర్త్ డే స్పెషల్: బీట్స్ అఫ్ రాధేశ్యాం!!
Prabhas birthday special: beats of radhe shyam released ప్రభాస్ బర్త్ డే స్పెషల్: బీట్స్ అఫ్ రాధేశ్యాం!!
Advertisement
Ads by CJ

రెబ‌ల్ స్టార్  ప్ర‌భాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల..

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్. అక్టోబర్23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్ర‌మాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ విడుద‌ల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజ హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ప్ర‌తి సినిమాకి త‌న హ్యాండ్ స‌మ్ లుక్స్, స్టైలిష్ మేకోవ‌ర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా స్థాయి అర్థం అయిపోతుంది. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్  చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని రెబ‌ల్‌స్టార్ డాక్టర్ యూ.వి.కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ఇట‌లిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు

Prabhas birthday special: beats of radhe shyam released:

Good response to beats of radhe shyam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ