చైతన్య కృష్ణ, పాయల్ రాజ్‌పుత్ 'అనగనగా ఓ అతిథి' ఫస్ట్‌లుక్ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి
తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ 'ఆహా'. కోవిడ్ సమయంలో వరుస కొత్త చిత్రాలతో ఆకట్టుకున్న ఆహా ఇప్పుడు తమ ఓటీటీలో 'అనగనగా ఓ అతిథి' చిత్రాన్ని నవంబర్ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అనగనగా ఓ అతిథి పీరియాడికల్ మూవీ. కన్నడ చిత్రపరిశ్రమలో అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్ పద్మనాభన్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్న తొలి చిత్రమిది. ఓ కుటుంబ పేదరికంతో బాధపడుతుంటుంది. వారి కష్టాలను దాటడానికి ఓ జ్యోతిష్యుడు చెప్పిన జాతకం అలానే వారి జీవితం లోకి వచ్చిన అతిథి వల్ల కుటుంబ సభ్యులకు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దురాశ, మోహం, అత్యాశ వంటి ఎలిమెంట్స్‌ను సూచించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా...
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ సీట్‌ఎడ్జ్ థ్రిల్లర్ మూవీగా ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అనగనగా ఓ అతిథి చిత్రం ఊహించని మలుపులతో ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు అన్నారు. డైరెక్టర్ దయాల్ పద్మనాభన్ మాట్లాడుతూ తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. ఎమోషన్స్, డ్రామ, సస్పెన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది అన్నారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను చేయని ఓ డిఫరెంట్ పాత్ర. పాత్ బ్రేకింగ్ పాత్ర చేశానని హ్యాపీగా అనిపిస్తుంది అన్నారు. చైతన్య కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాలో చేసిన పాత్ర కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ దయాల్ పద్మనాభన్‌గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు.
తెలుగు ప్రేక్షకుల అభిమాన తారలు నటించిన చిత్రాలతో పాటు క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ఆహా తెలుగు ప్రేకకుల హృదయాలకు దగ్గరైంది. వారికి మరింత ఎంటర్‌టైన్మెంట్‌ను అందించే దిశగా మేం ఇంకా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్, ఒరేయ్ బుజ్జిగా, కలర్‌ఫొటో చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు వీటి సరసన అనగనగా ఓ అతిథి చిత్రం చేరనుంది.