Advertisementt

'మిస్‌ ఇండియా'... ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ: కీర్తిసురేశ్‌

Mon 02nd Nov 2020 07:36 PM
keerthy suresh,miss india movie  'మిస్‌ ఇండియా'... ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ: కీర్తిసురేశ్‌
Keerthy Suresh About Miss India Movie 'మిస్‌ ఇండియా'... ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ: కీర్తిసురేశ్‌
Advertisement
Ads by CJ

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మిస్‌ ఇండియా. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన మిస్‌ ఇండియా నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్‌ 4న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో కీర్తిసురేశ్‌ మాట్లాడుతూ..

మిస్‌ ఇండియా.. ఓటీటీలో విడుదలవుతున్న నా రెండో చిత్రమిది. ప్రస్తుతం సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకులకు చేర్చడమెలా అనేది ముఖ్యం. ఆ కోణంలో చూస్తే ఓటీటీలో మిస్‌ ఇండియా విడుదల కావడం నాకు సంతోషాన్నిచ్చే విషయమే. 

మహానటి తర్వాత నేను కమర్షియల్‌ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్న సమయంలో నాకు ఎక్కువ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయమని అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే నచ్చిన సినిమాలు ఓకే చేశాను. 

విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి దేశంలో మన దేశం నుండి వెళ్లిన ఓ అమ్మాయి టీ బిజినెస్‌ను స్టార్ట్‌ చేస్తుంది. బిజినెస్‌ రంగంలో రాణించాలని ఆ మధ్య తరగతి అమ్మాయి చాలా కలలు కంటుంది. టీ బిజినెస్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఆమె ఎలా అధిగమించి సక్సెస్‌ అయ్యిందనేదే మిస్‌ ఇండియా సినిమా. ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీనే ఈ సినిమా. నిజానికి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పుడు సినిమా అందానికి సంబంధించిన సినిమా అయ్యుంటుందేమోనని అందరూ ఆనుకున్నారు. కానీ ట్రైలర్‌ విడుదలైన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. 

నరేంద్రనాథ్‌కి డైరెక్టర్‌గా తొలి సినిమా. అయితే నేను ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు. స్క్రిప్ట్‌ ఎలా ఉందని చూశాను. సినిమాపై తనకున్న ఆసక్తి, విజన్‌ నచ్చింది. తన నెరేషన్‌ నచ్చింది. నరేంద్ర ప్రతి విషయంలో చాలా డిటెయిల్డ్‌గా ఉన్నాడు. అందుకనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. 

మహానటి రిలీజ్‌ తర్వాత వర్కవుట్‌ చేయడం మొదలు పెట్టాను. అయితే ఇంత స్లిమ్‌గా కావడానికి మిస్‌ ఇండియా కూడా ఓ కారణమని చెప్పొచ్చు. సినిమాలో సన్నగా ఉండాలి, ఏ డ్రెస్‌ వేసినా బావుండాలని డైరెక్టర్‌ చెప్పడంతో బరువు తగ్గాను. 

నిర్మాత మహేశ్‌ కోనేరు.. మహానటి తర్వాత నేనైతేనే మిస్ ఇండియాకు న్యాయం చేస్తానని నన్ను సంప్రందించారు. డైరెక్టర్‌ చెప్పిన కథ కూడా నచ్చింది. కథానుగుణంగా మహేశ్‌ కొనేరుగారు సినిమాను చాలా రిచ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో నిర్మించారు. 

మహానటి తర్వాత నటిగా నా బాధ్యత మరింత పెరిగింది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు వచ్చినప్పుడు మరింత పర్‌ఫెక్షన్‌తో  సినిమా చేయాలని తపన ఎక్కువైంది. నటిగా నన్ను నేను ఎక్స్‌ప్లోర్‌ చేసుకోవాలనే ఆలోచిస్తాను. ఆ క్రమంలో వెబ్ సిరీస్‌లు చేయడానికి అయినా నేను సిద్ధమే. అయితే మంచి కాన్సెప్ట్‌ ఉండాలి. డేట్స్ అడ్జస్ట్‌ చేసే సమయంలో సమస్యలు రాకపోతే వెబ్‌ సిరీస్‌ల్లో నటించడానికి అభ్యంతరం లేదు.

మహేశ్‌తో తొలిసారి సర్కారువారిపాటలో నటిస్తున్నాను. జనవరి నుండి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. 

ఈ నవంబర్‌ 4న మిస్‌ ఇండియా విడుదలవుతుంది. దీని తర్వాత గుడ్‌లక్‌ సఖి విడుదలకు సిద్ధంగా ఉంది. సర్కారు వారి పాట, అణ్ణాత్తే సినిమాల్లో నటిస్తున్నాను. వీటితో పాటో ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి.

Click Here Vedio: Keerthy Suresh About Miss India Movie

Keerthy Suresh About Miss India Movie:

Keerthy Suresh About Miss India Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ