రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్
కు ప్రముఖ నాయిక రశ్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు
పరిచయం చేశారు. రశ్మిక కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు
పరిచయం చేయనుంది.
మంగళవారం యువర్ లైఫ్ వెబ్ పోర్టర్ తమ సంస్థలోకి రశ్మికకు వెల్ కమ్
చెప్పారు. టుగెదర్ ఫర్ వెల్ నెస్ అనే క్యాప్షన్ తో ఆరోగ్యాన్ని అందిద్దా
అంటూ అహ్వానించారు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ఫుడ్, వర్కవుట్స్
వంటి కంప్లీట్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు.