విజయ రాఘవన్ ఫస్ట్‌లుక్ విడుదల
విజయ్ ఆంటోని హీరోగా ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్, చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం విజయ రాఘవన్ ఫస్ట్‌లుక్ విడుదల.
నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న చిత్రం విజయ రాఘవన్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఎత్తైన భవనాల సముదాయంపై స్టైల్‌గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న విజయ్ ఆంటోని ఫొటోను ఫస్ట్‌లుక్‌గా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా ఇన్‌టెన్స్ లుక్‌తో విజయ్ ఆంటోని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్, ఎడిటర్: లియో జాన్ పాల్, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్, బి.ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్.విక్రమ్ కుమార్, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్, రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్.