Advertisementt

పూజా హెగ్ఢే బ్యాచ్ ల‌ర్ తో దీపావ‌ళి సంబరాలు!

Fri 13th Nov 2020 07:06 PM
most eligible bachelor movie,akhil akkineni,pooja hegde  పూజా హెగ్ఢే బ్యాచ్ ల‌ర్ తో దీపావ‌ళి సంబరాలు!
Akhil with Pooja Hegde on the occasion of Diwali పూజా హెగ్ఢే బ్యాచ్ ల‌ర్ తో దీపావ‌ళి సంబరాలు!
Advertisement
Ads by CJ

>దీపావ‌ళి సందర్బంగా పూజా హెగ్డే తో చుచ్చుబిడ్డి వెలిగించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్"‌

>అఖిల్ అక్కినేని ఈ మ‌ద్యే మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని  అడుగుతూ త‌న టీజ‌ర్ ని అంద‌రి అంచ‌నాలు అందుకేనేలా చేశాడు. ఇప్ప‌డు దీపావ‌ళికి చుచ్చుబ‌డ్డి ని పూజా తో వెలిగించేసి అంద‌ర్ని ఆక‌ట్ట‌కున్నాడు. అఖిల్ అక్కినేని  హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్శ‌తో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌లర్.  ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్ధే న‌టిస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీతాగొవిందం చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన‌ గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ల మ‌ద్య వున్న కెమిస్ట్రి ఈ  దివాళి పోస్ట‌ర్ తో తెలిసేలా  బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న‌దైన శైలిలో అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అంద‌రూ ఆక‌ట్టుకునే రీతిలో డిజైన్ చేశారు.  దిపావళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ రోజు ఈ క‌ల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. >సంక్రాంతి కి సిద్ద‌మ‌వుతున్న రొమాంటిక్‌‌ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్  మెస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్.>ఇప్ప‌టికే  శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న రొమాంటిక్‌ ఫ్యామిలి ఎంటెర్టైనర్  సంక్రాంతి కానుక‌గా రానుంది. ఈ చిత్రం లో ఫ్యామిలి ఎమొష‌న్స్ తో పాటు యూత్ కి కావ‌ల‌సిన అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. చ‌క్క‌టి మాట‌ల తో పాట‌ల‌తో ఆలోచించే క‌థ తో ఆనందించే క‌ద‌నం తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాని ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ తో ఈ సంక్రాంతి కి ఫ్యామిలి అంతా క‌లిసి చూసి ఆనందిచే చిత్రం మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు, వాసు వ‌ర్మ‌, జిఏ2 పిక్చ‌ర్స్ కాంబినేష‌న్ లో అందర్ని అల‌రించటానికి వ‌స్తున్నారు. ఈ చిత్రం లో ముర‌ళి శ‌ర్మ‌, ఆమ‌ని, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను చాలా మంచి పాత్ర ల్లో క‌నిపిస్తారు. ఈ చిత్రం  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 లో జ‌న‌వ‌రి సంక్రాంతి  కి విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

>న‌టీ న‌టులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్, >సాంకేతిక నిపుణులు.. బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్, స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్, మ్యూజిక్ : గోపీ సుంద‌ర్, సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ, ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్, ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా, పి ఆర్ ఒ - ఏలూరు శ్రీను, నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ, డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్.

Akhil with Pooja Hegde on the occasion of Diwali:

Akhil and Pooja Hegde celebrate Diwali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ