Advertisementt

రీతువర్మకు వరుడు కావలెను.!

Fri 13th Nov 2020 07:24 PM
varudu kavalenu movie,naga shourya,rituvarma  రీతువర్మకు వరుడు కావలెను.!
Naga Shourya, Rituvarma Movie "Varudu Kavalenu" రీతువర్మకు వరుడు కావలెను.!
Advertisement
Ads by CJ

నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం  ‘వరుడు కావలెను‘

నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘ చిత్రం పేరు ఖరారు చేస్తూ వీడియో విడుదల. 

వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో  ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే.. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు  ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.

Naga Shourya, Rituvarma Movie "Varudu Kavalenu":

Naga Shourya and Rituvarma movie Varudu Kavalenu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ