శర్వానంద్, సిద్ధార్థ్, అజయ్ భూపతి, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ ఫిల్మ్ మహాసముద్రం థీమ్ పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మహాసముద్రం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ అందరిలోనూ కుతూహలాన్ని కలిగిస్తోంది. హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేసిన అజయ్ భూపతి దీపావళి పర్వదినం సందర్భంగా అభిమానులకు ఆనందం కలిగిస్తూ మహాసముద్రం థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
టైటిల్ డిజైన్ ఎంత సింపుల్‌గా ఉందో అంత ఎఫెక్టివ్‌గా ఉంది. థీమ్ పోస్టర్‌లో అనేక ఆలోచింపజేసే, ఆసక్తి రేకెత్తించే ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సంధ్యాసమయాన్ని సూచించే ఎరుపెక్కిన ఆకాశం, అదే రంగులో కనిపిస్తోన్న సముద్రం, ఒకవైపు గన్‌పై దూరదూరంగా నిల్చున్న జంట, మరోవైపు ట్రైన్‌ను అందుకోవడానికి పరుగెత్తుతున్న యువకుడిని మనం ఈ పోస్టర్‌లో చూడొచ్చు.
ప్రేమ ఒకవైపు అయితే యుద్ధం మరోవైపు అని దర్శకుడు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారు.
An immeasurable love (అపరిమితమై ప్రేమ) అనే క్యాప్షన్ ఈ సినిమా దేని గురించే తెలియజేస్తోంది.
థీమ్ పోస్టర్‌కు వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్‌కు చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఒక పోస్టర్‌తో సినిమా కంటెంట్‌ను మైండ్-బ్లోయింగ్ అనిపించేలా చూపించడం అజయ్ భూపతికే చెల్లిందనిపిస్తోంది.
ఈ మూవీలో అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.
రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.