Advertisementt

జార్జ్ రెడ్డి కాదు 'జాంబీ రెడ్డి' సినిమా..

Wed 18th Nov 2020 05:19 PM
zombie reddy movie,teja sajja  జార్జ్ రెడ్డి కాదు 'జాంబీ రెడ్డి' సినిమా..
Not George Reddy 'Zombie Reddy' Movie. జార్జ్ రెడ్డి కాదు 'జాంబీ రెడ్డి' సినిమా..
Advertisement
Ads by CJ

జార్జ్ రెడ్డి కాదు 'జాంబీ రెడ్డి' సినిమా.. ప్ర‌శాంత్ వ‌ర్మ, తేజ స‌జ్జా కాంబినేష‌న్ ఫిల్మ్‌ 'జాంబీ రెడ్డి' షూటింగ్ పూర్తి.. డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభం.

ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తోన్న మూడో చిత్రం 'జాంబీ రెడ్డి' షూటింగ్ పూర్త‌యింది. బాల‌న‌టునిగా ప్రేక్ష‌కుల విశేష ఆద‌రాభిమానాలు పొంది, 'ఓ బేబీ' చిత్రంలో చేసిన కీల‌క పాత్ర‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆనంది, ద‌క్ష హీరోయిన్లు. బుధ‌వారం ఈ చిత్రానికి సంబంధించి డ‌బ్బింగ్ వ‌ర్క్ మొద‌లైంది. మొద‌ట‌గా హీరో తేజ స‌జ్జా త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్నారు.ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కూ, మోష‌న్ పోస్ట‌ర్‌కూ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి చిత్రం బృందం స‌న్నాహాలు చేస్తోంది. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, లాక్‌డౌన్ స‌డ‌లించాక ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు టాలీవుడ్‌లో షూటింగ్ పున‌రుద్ధ‌రించి, పూర్తి చేసిన తొలి చిత్రం ఇదే. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల అంద‌రి స‌హ‌కారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీక‌ర‌ణ పూర్తి చేశామ‌నీ, ఇందుకు వారికి థాంక్స్ చెప్పుకుంటున్నామ‌నీ ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

తారాగ‌ణం: తేజ స‌జ్జా, ఆనంది, ద‌క్ష‌. 

సాంకేతిక బృందం: స్క్రీన్‌ప్లే: స‌్ర్కిప్ట్స్‌విల్లే, మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌, సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌, ఎడిటింగ్‌: సాయిబాబు, ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల, పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి, నిర్మాత‌: రాజ్‌శేఖ‌ర్ వ‌ర్మ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌, బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్.

Not George Reddy 'Zombie Reddy' Movie.:

Zombie Reddy shooting is over

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ