Advertisementt

జీ స్టూడియో లో ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’

Wed 18th Nov 2020 05:49 PM
solo bratuke so better movie,actor sai tej,solo brathuke so better movie  జీ స్టూడియో లో ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’
Zee Studio acquires distribution rights for 'Solo Bratuke So Better' జీ స్టూడియో లో ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’
Advertisement
Ads by CJ

‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ పంపిణీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న జీ స్టూడియో.. డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ సుబ్బు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఎంటర్‌టైనర్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సాయితేజ్‌, న‌భాన‌టేశ్ సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్స్ న‌టించిన ఈ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిచారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌లు, థీమ్ వీడియోకు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. వెంక‌ట్ సి.దిలీప్ ఈ  చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. 

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సోలో బ్రతుకే సోబెటర్ సినిమా జర్నీలో జీ స్టూడియోతో భాగం కావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది’’ అన్నారు. 

నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మా ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి జీ స్టూడియోతో క‌లిసి ముందుకు రావ‌డం ఆనందంగా ఉంది. థియేట‌ర్స్‌ను ఓపెన్ చేస్తున్నార‌ని తెలియ‌గానే మా యూనిట్ అంతా చాలా ఎగ్జయిట్ అయ్యాం. ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ అన్ని ఎమోష‌న్స్ ఉన్న‌ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు రప్పిస్తుంది’’ అన్నారు. 

జీ స్టూడియో సీఇఓ ష‌రీక్ ప‌టేల్ మాట్లాడుతూ ‘‘శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర  వారితో కలిసి ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ సినిమాను విడుద‌ల చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఇంత‌కు ముందు ఇక్క‌డ మేం విడుదల చేసిన చిత్రాలు మంచి స‌క్సెస్‌ను సాధించాయి. అదే కోవ‌లో ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు. 

న‌టీన‌టులు: సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు, నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్, ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌, ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి, సంగీతం: త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ సి.దిలీప్‌.

Zee Studio acquires distribution rights for 'Solo Bratuke So Better':

'Solo Bratuke So Better' Released in December.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ