Advertisementt

'కనులతో రచించు' పాట బ్యూటిఫుల్ -హీరో శ్రీ విష్ణు

Fri 20th Nov 2020 08:39 PM
merise merise movie  'కనులతో రచించు' పాట  బ్యూటిఫుల్ -హీరో శ్రీ విష్ణు
Beautiful song Kanulato racincu -Hero Sri Vishnu 'కనులతో రచించు' పాట బ్యూటిఫుల్ -హీరో శ్రీ విష్ణు
Advertisement
Ads by CJ

"మెరిసే మెరిసే" చిత్రంలోని 'కనులతో రచించు' పాట  బ్యూటిఫుల్ గా ఉంది.. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.. హీరో శ్రీ విష్ణు.

'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్ గా  కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కుమార్ కె.దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం "మెరిసే మెరిసే". లవ్,కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది. కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు.. కాగా ఈ చిత్రంలోని  శ్రేష్ట్ రాసిన "కనులతో రచించు" పాటని హీరో శ్రీ విష్ణు లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు దినేష్ తేజ్, దర్శకుడు పవన్ కుమార్, నిర్మాత వెంకటేష్ కొత్తూరి పాల్గొన్నారు..

శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమాకి పనిచేసిన టీం అంతా నాకు బాగా కావాల్సిన సన్నిహితులు. కనులతో రచించు సాంగ్ బ్యూటిఫుల్ గా ఉంది. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా కొత్తగా తీసాడు పవన్. హీరో దినేష్ పెంటాస్టిక్ గా చేసాడు. నిర్మాత వెంకటేష్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సాంగ్ తో పాటు త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా  అందరికీ నచ్చుతుంది.. టీం అందరికే ఆల్ ది వెరీ బెస్ట్ అన్నారు.

దర్శకుడు పవన్ కుమార్ కె.మాట్లాడుతూ.. మాలాంటి కొత్త వారిని సపోర్ట్ చేసి మా చిత్రంలోని కనులతో రచించు  పాటని లాంఛ్ చేసిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. స్వచ్ఛమైన అచ్చ తెలుగు పదాలతో శ్రేష్ట్ రాసిన పాటని చిన్మయి, విజయ్ ప్రకాష్ అద్భుతంగా ఆలపించారు. కార్తీక్ బ్యూటిఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేసాడు. పిక్చరైజేషన్ పరంగా ఎక్సలెంట్ గా షూట్ చేసాం. యూత్ అందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఈసినిమా ఉంటుంది..నా మీద నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాత వెంకటేష్ గారికి నా ధన్యవాదాలు..బడ్జెట్ కి ఎక్కడా వెనకాడకుండా మెరిసే మెరిసే చిత్రాన్ని నిర్మించారు.. అన్నారు.

హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ.. మెరిసే మెరిసే చిత్రంలోని కనులతో రచించు పాటని రిలీజ్ చేసిన శ్రీ విష్ణుకి థాంక్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.. అన్నారు.

చిత్ర నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ..  ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీ విష్ణు గారు రిలీజ్ చేసిన కనులతో రచించు పాట అందరికీ నచ్చుతుంది. సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న మెరిసే మెరిసే చిత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.. అన్నారు.

Beautiful song Kanulato racincu -Hero Sri Vishnu:

Beautiful song Kanulato racincu -Hero Sri Vishnu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ