ఘట్టమనేని సితార క్లాప్, నమ్రత మహేష్ కెమెరా స్విచాన్ తో ప్రారంభమైన సూపర్ స్టార్ మహేష్ 'సర్కారు వారి పాట'.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట' మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కనుంది. నవంబర్ 21న 4th KPHB కాలనీ లోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో 11:43 కి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తం షాట్ ని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో తీశారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: థమన్ .ఎస్, సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ. రాజు , లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
Click Here: Sarkaru Vaari Paata Movie Opening