మహేష్ బాబు కి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ అందరికి తెలుసు. మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారాతో ఆటలాడుతూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక కూతురు సితారతో అయితే మహేష్ బాండింగ్ సోషల్ మీడియా పిక్స్ తో అర్ధం చేసుకోవచ్చు. లాక్ డౌన్ లో ఇంట్లోనే పిల్లలతో హాయిగా సేద తీరిన మహేష్.. ఫ్యామిలీ తో కలిసి దుబాయ్ ట్రిప్ వేసి వచ్చాడు. దుబాయ్ లో మహేష్ కొడుకు గౌతమ్, కూతురు సితారాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరాలు అయ్యాయి. పిల్లలతో మహేష్ హ్యాపీ మూమెంట్స్ ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
సమంత ప్రస్తుతం భర్త నాగ చైతన్య తో మాల్దీవుల్లో సేద తీరుతుంది. మాల్దీవుల్లో తాను ఉన్న ప్లేస్ వ్యూ చూపిస్తూ రోజుకో పిక్ షేర్ చేస్తుంది. అందులో సమంత సముద్రపు ఒడ్డున చిల్ అవుతున్న ఫొటోస్, అలాగే సమంత సైక్లింగ్ చెయ్యడనికి రెడీ అవుతున్న ఫొటోస్ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మాల్దీవుల్లో జాలిగా గడుపుతున్నా అంటూ సమంత అందరిని ఊరిస్తుంది.