Advertisementt

హైద‌రాబాద్ కు మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా'

Wed 25th Nov 2020 02:55 PM
son of india movie,dr mohan babu,story director diamond ratnababu,   హైద‌రాబాద్ కు మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా'
Dr Mohan Babu’s Son Of India Hyderabad Schedule Begins హైద‌రాబాద్ కు మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా'
Advertisement
Ads by CJ

డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు చిత్రం 'స‌న్ ఆఫ్ ఇండియా' హైద‌రాబాద్ షెడ్యూల్ ప్రారంభం

క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు హీరోగా న‌టిస్తోన్న‌ దేశ‌భ‌క్తి క‌థా చిత్రం 'స‌న్ ఆఫ్ ఇండియా'. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో డాక్ట‌ర్‌ మోహ‌న్‌బాబు న‌టిస్తోన్న ఈ త‌ర‌హా క‌థ కానీ, ఈ జాన‌ర్ సినిమా కానీ ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌లో రాలేదు. మొద‌ట తిరుప‌తి షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసింది. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఈరోజు బుధ‌వారం హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను ప్రారంభించారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై అధిక భాగం స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రిస్తారు.

మోహ‌న్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయ‌న కోడ‌లు విరానికా మంచు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం. మోహ‌న్‌బాబును ఆమె పూర్తిగా స‌రికొత్త రూపంలో చూపిస్తున్నారు.

మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు అందిస్తోన్న ఈ చిత్రానికి స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు స్వ‌యంగా స్క్రీన్‌ప్లే స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాట‌లు రాస్తుండ‌గా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా చిన్నా ప‌నిచేస్తున్నారు.

సాంకేతిక బృందం: బ్యాన‌ర్స్‌: శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, మ్యూజిక్‌:  మేస్ట్రో ఇళ‌య‌రాజా, డీఓపీ: స‌ర్వేష్ మురారి, డైలాగ్స్‌: తోట‌ప‌ల్లి సాయినాథ్‌, స్టైలిస్ట్ (డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు):  విరానికా మంచు, పాట‌లు:  సుద్దాల అశోక్‌తేజ‌, ఆర్ట్‌:  చిన్నా, ఎడిటింట్‌:  గౌతంరాజు, పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్, క‌థ‌-ద‌ర్శ‌క‌త్వం:  డైమండ్ ర‌త్న‌బాబు, స్క్రీన్‌ప్లే:  డాక్ట‌ర్ ఎం. మోహ‌న్‌బాబు, నిర్మాత‌:  విష్ణు మంచు.

Dr Mohan Babu’s Son Of India Hyderabad Schedule Begins:

Dr Mohan Babu’s Son Of India Hyderabad Schedule Begins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ