Advertisementt

చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారు!

Fri 27th Nov 2020 10:02 AM
chiranjeevi,nagarjuna,lobbying,yeluru surender reddy,producers,ghmc elections,ghmc,ghmc elections,trs  చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారు!
Chiranjeevi, Nagarjuna have done us an injustice by lobbying! చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారు!
Advertisement
Ads by CJ

చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారు!

మా సినిమా పెద్దల కి.. తెలంగాణ గవర్నమెంట్ వారు GHMC ఎలక్షన్స్ సమయంలో సినిమా ఇండస్ట్రీకి వరాల జల్లు కురిపించారు.. అని మేము చంకలు కొట్టుకుంటున్నాము. చూస్తుంటే  పెద్ద లాబీయింగ్ జరిగినట్లు అనిపిస్తూ ఉంది.పెద్ద హీరోలకి లీజు థియేటర్స్ వాళ్లకి వారికి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. 10 కోట్ల లోపు సినిమాకి GST  వాపస్ అన్నారు. పదికోట్ల సినిమాని చిన్న సినిమా అంటారా. చిన్న సినిమా అంటే రెండు నుంచి మూడు కోట్ల లోపు సినిమాలనే చిన్న సినిమా అంటారు. ఈ చిన్న సినిమాల కి GST నెంబరే వుండదు. సినిమా కి ఎంత లెక్క చూపిస్తామొ మనందరికీ తెలుసు. సంవత్సరంలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు, బడ్జెట్ సినిమాలు మహా అంటే 20 నుంచి 30 వరకు మాత్రమే. మిగిలిన 170 నుంచి 180 సినిమాలు చిన్న సినిమాలు.

ఇండస్ట్రీకి కొత్త టెక్నీషియన్స్ ని, కొత్త ఆర్టిస్ట్ ని తీసుకు వచ్చేది, సామాజిక సృహ ఉన్న చిత్రాలని తీసేది ఈ చిన్న నిర్మాతలే. 30 వేల కార్మికులకు పని ఇచ్చి కాపాడేది ఈ 180 చిత్రాల నిర్మాతలే. అలాంటి చిన్న సినిమాలు తీసె నిర్మాతల నోట్లో మట్టి కొట్టారు. చిన్న చిత్రాల నిర్మాతలు మేము అడిగినవి మూడే మూడు. థియటర్స్ లో 2 గంటల షో కంపల్సరీ చిన్న సినిమా ప్రదర్శనకి అడిగాము. ఫ్రీ లొకేషన్స్ ఇవ్వమని అడిగాము. ఆ ఊసే లేదు.

థియేటర్స్ లో సినిమా ప్రదర్శన కోసం డిజిటల్ ప్రోవైడర్స్  అన్యాయంగా వారానికి 12,000 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. దానిని పరిష్కరించమన్నాం. చిన్న చిత్ర నిర్మాతలడిగిన వీటిని పక్కన పడేశారు. చిరంజీవి గారికి, నాగార్జున గారికి చిన్న నిర్మాతలు కనిపించడం లేదు. ఇండస్ట్రీ అంటే మీ ఇరవై సినిమాలు కాదు సార్. 180 సినిమాలు ఉన్నాయి. ఆ 180 నిర్మాతల శాపనార్థాలు మీరు తగిలించుకొకండి సార్. ఇండస్ట్రీ పెద్దలుగా వెళ్లి సంవత్సరం లో 180 చిత్రాలను తీస్తున్న చిన్న చిత్ర నిర్మాతలకి చాలా అన్యాయం చేశారు. 'సార్. మీకు కావలసినవి మీరు లాబీయింగ్ చేసుకుంన్నారు. థ్యాంక్స్ సార్'..

తెలుగు ఫిలిం చాంబర్ ప్రోడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్.

-యేలూరు సురేందర్ రెడ్డి.

Chiranjeevi, Nagarjuna have done us an injustice by lobbying!:

A lot of injustice has been done to small filmmakers.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ