Advertisementt

ఫ‌న్నీగా ‘హానీమూన్’

Fri 27th Nov 2020 09:48 PM
web series honey moon,webseries honeymoon  ఫ‌న్నీగా ‘హానీమూన్’
Funny web series 'Honeymoon' ఫ‌న్నీగా ‘హానీమూన్’
Advertisement
Ads by CJ

‘ఆహా’లో మెప్పిస్తోన్న ఫ‌న్నీ వెబ్ సిరీస్ ‘హానీమూన్’

ఈ ఏడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల‌ను ఐదు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో ఆక‌ట్టుకున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రైడ్‌ను కంటిన్యూ చేస్తూ ఈ శుక్ర‌వారం స‌రికొత్త ఫ‌న్నీ వెబ్ సిరీస్ ‘హ‌నీమూన్‌’ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొంది రీసెంట్‌గా విడుద‌లైన వెబ్ సిరీస్ ‘క‌మిట్‌మెంట‌ల్‌’ సక్సెస్ తర్వాత ఆహా మాధ్య‌మంలో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటున్న  వెబ్ సిరీస్ ‘హ‌నీమూన్‌’ పెద్ద‌లు చేసిన  పెళ్లితో ఒక‌టైన ఓ జంట.. ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకున్న నిజాలు, ర‌హ‌స్యాలు ఏంటి?  త‌ర్వాత వారి జీవితంలో జరిగిన ప‌రిణామాలు ఏంటనేదే ఈ వెబ్ సిరీస్ క‌థాంశం. 

స‌క్క‌త్‌ స్టూడియో, శ్రీముతు సినీ స‌ర్వీస్ బ్యాన‌ర్స్‌పై క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ డా.శివ‌రాజ్ కుమార్, నివేదిత శివ‌రాజ్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. కొత్త‌గా పెళ్లైన జంట చేసే భావోద్వేగ ప్ర‌యాణమే ఇది. ఇందులో క‌న్న‌డ సెన్సేష‌న్ నాగ‌భూష‌ణ‌, సంజ‌నా ఆనంద్ జంట‌గా న‌టించారు. ప్ర‌వీణ్‌, తేజ‌స్విని అనే కొత్త‌గా పెళ్లైన భార్య భ‌ర్త‌ల‌ పాత్ర‌ల్లో వీరిద్ద‌రూ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రేమ‌లో ప‌డ్డ‌ప్పుడు వారు ఎదుర్కొనే ఒడిదొడుకుల‌ను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించారు. వెబ్ సిరీస్ పోస్ట్ రిలీజ్ త‌ర్వాత హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. 

న‌టీన‌టులు: నాగ‌భూష‌ణ‌, సంజ‌నా ఆనంద్‌, ప‌వ‌న్ కుమార్, అపూర్వ భ‌ర‌ద్వాజ్‌, ఆనంద్ నినాశం, మ‌హాదేవ్‌, పూర్ణ‌, అర్చ‌నా కొటిగే, ఇమ్రాన్ పాషా త‌దిత‌రులు. 

సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌: నాగ‌భూష‌ణ‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌: తేజెస్ గ‌ణేశ్‌, నాగ‌భూష‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీ: శిరీష కుడువ‌ల్లి, రాహుల్ రాయ్‌, సంగీతం: వాసుకి వైభ‌వ్‌, ఎడిట‌ర్: ప్ర‌దీప్ నాయ‌క్‌, క‌ల‌రిస్ట్‌: టామ్ సి.జోస్, ద‌ర్శ‌క‌త్వం: సక్క‌త్ స్టూడియో క్రియేటివ్ టీమ్‌, నిర్మాత‌లు: నివేదితా శివ‌రాజ్‌కుమార్‌, సక్క‌త్ స్టూడియో.

Funny web series 'Honeymoon':

Webseries Honeymoon is unconventional, funny and relatable.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ