Advertisementt

ఇది యంగ్‌ హీరో నాగశౌర్య `ల‌క్ష్య`

Mon 30th Nov 2020 07:59 PM
lakshya movie,naga shaurya,director santhossh jagarlapudi  ఇది యంగ్‌ హీరో నాగశౌర్య `ల‌క్ష్య`
Nagashourya's upcoming movie `Lakshya` ఇది యంగ్‌ హీరో నాగశౌర్య `ల‌క్ష్య`
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో నాగశౌర్య, సంతోష్‌ జాగర్లపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `ల‌క్ష్య`

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..ఈ చిత్రానికి `ల‌క్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఈ రోజు సాయంత్రం 5:04 నిమిషాల‌కు స్పెష‌ల్  పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లో నాగ‌శౌర్య లుక్  అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై  ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.

నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. `ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద  సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ లో నాగ‌శౌర్య నిల్చొని ఉన్న లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేశారు.  ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం:  కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌:  జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి.

 

Nagashourya's upcoming movie `Lakshya`:

Naga Shaurya Film Is Titled As 'LAKSHYA'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ