Advertisementt

కంటెస్టెంట్స్ ని ఏడిపిస్తున్న బిగ్ బాస్!

Wed 02nd Dec 2020 04:41 PM
bigg boss 4,bigg boss,nagarjuna,akhil,monal,harika,avinash,ariyana,abhijeet  కంటెస్టెంట్స్ ని ఏడిపిస్తున్న బిగ్ బాస్!
Bigg Boss contestants shedding tears!! కంటెస్టెంట్స్ ని ఏడిపిస్తున్న బిగ్ బాస్!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి బిగ్ బాస్ వెయ్యని ప్లాన్ లేదు. నిన్నటివరకు చప్పగా సాగిన బిగ్ బాస్ టాస్క్ ల పరంగా లేపలేక కంటెస్టెంస్ట్ మధ్యన చిచ్చు పెడుతున్నాడు. ఇప్పటివరకు జంట పక్షుల్లా తిరిగిన.. జంటలు రెండూ విడిపోయి ఎవరికీ వారే అయ్యారు. మోనాల్, అఖిల్ ఒకరికి ఒకరు అంటూ చూపించిన బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళ  మధ్యన మంట పెట్టింది. హారిక - అభిజిత్ మధ్యన అగ్గి రాజేసింది.. దానితో హారిక అభిజిత్ ని నామినేట్ చేసింది. అభి ఒంటరి వాడిగా ఫలవుతున్నాడు. హారిక ఏడవలేక నవ్వుతుంది. ఇక అవినాష్ ఎక్కడ ఎలిమినేట్ అవుతానో అంటూ తెగ బాధపడుతున్నాడు. అరియనా అయితే తాను టికెట్ టు ఫినాలేకి వెళ్లలేకపోయా అంటూ ఏడుస్తుంది.

బిగ్ బాస్ అంతా రచ్చ, ఏడుపు. ప్రోమోస్ లో కంటెస్టెంట్స్ ఏడవడం చూసిన బుల్లితెర ప్రేక్షకులు అయ్యో ఈ రోజు ఎపిసోడ్ లో ఏమవుతుంది.. ఎందుకు ఏడుస్తున్నారనే క్యూరియాసిటీని బిగ్ బాస్ ప్రేక్షకుల్లో పెంచడంతో బిగ్ బాస్ కి ఇప్పుడు క్రేజ్ వచ్చింది. తాజాగా హారిక, సోహైల్ తో టికెట్ టు ఫినాలే టాస్క్ లెవెల్ టు లో గొడవ పడడమే కాదు... ఏడుస్తూ బిగ్ బాస్ ఇది అన్ ఫెయిర్ గేమ్. లాక్కోకూడదు, పట్టుకోకూడదు అంటే గేమ్ ఎలా ఆడాలి అంటూ ఏడవడంతో అవినాష్ హారిక కన్నీళ్లు తుడుస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది అనిపిస్తుంది. ఇక మోనాల్ అయితే అఖిల్ మాట్లాడడం లేదనే ఫ్రస్టేషన్ లో ఉంది. 

Bigg Boss contestants shedding tears!!:

Contestants crying continuously because of bigg boss!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ