Advertisementt

‘సెబాస్టియన్‌ పిసి 524’ కు రేచీకటి!

Wed 02nd Dec 2020 07:45 PM
sebastian pc 524 movie,kiran abbavaram,sebastian pc 524 movie stills  ‘సెబాస్టియన్‌ పిసి 524’ కు రేచీకటి!
'Sebastian PC 524' Movie Opening ‘సెబాస్టియన్‌ పిసి 524’ కు రేచీకటి!
Advertisement
Ads by CJ

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి 524’

కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. అలాగే, కిరణ్‌ అబ్బవరానికి హీరోగా మరిన్ని అవకాశాలు ఇచ్చింది. ‘రాజావారు రాణిగారు’ విజయం తర్వాత అతను ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ చేస్తున్నారు. ఆల్రెడీ అందులో రెండు పాటలు ‘చూశారా కళ్లారా..’, ‘చుక్కల చున్నీ’ విడుదలయ్యాయి. శ్రోతలను ఆకట్టుకున్నాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ విడుదలకు ముందే కిరణ్‌ అబ్బవరం మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తుతున్న ‘సెబాస్టియన్‌ పిసి 524’ సినిమా మదనపల్లిలోని సొసైటీ కాలనీ రామాలయం కల్యాణ మండపంలో బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నమ్రతా దరేకర్‌, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్లు. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘నాకు ‘రాజావారు రాణిగారు’ తర్వాత ‘అమాయకుడు, నోట్లోంచి మాట రాదు’ అనే ఇమేజ్‌ వచ్చింది. నటుడిగా నాకు మంచి పేరొచ్చింది. దాని తర్వాత అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ చేస్తున్నాను. కమర్షియల్‌ మీటర్‌ సినిమా తర్వాత ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. నాకూ యాక్టింగ్‌కి స్కోప్‌ ఉండాలని అనుకున్నాను. అప్పుడు బాలాజీ ‘సెబాస్టియన్‌ పిసి 524’ కథ చెప్పారు. నైట్‌ బ్లైండ్‌నెస్‌ మీద ఉంటుంది. ఓ కొత్త నటుడికి మూడో సినిమాకే ఇటువంటి కథ అంటే ఛాలెంజింగ్ అని చెప్పాలి. నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. వెరీ ఎగ్జయిటింగ్‌ స్టోరీ. నైట్‌ బ్లైండ్‌నెస్‌ అనగానే సాఫ్ట్‌ సినిమా అనుకోవద్దు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనింగ్‌ సినిమా. ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాం. త్వరలో సంగీత దర్శకుడి వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని ప్లాన్‌ చేశాం. ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ విడుదలైన రెండు నెలలకు వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, కళ: కిరణ్‌, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.

'Sebastian PC 524' Movie Opening:

Kiran Abbavaram's 'Sebastian PC 524' Movie launched.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ