Advertisementt

టైసన్ లైన్లోకి వచ్చాడు!

Wed 02nd Dec 2020 08:32 PM
hero tyson rahu,l hero tyson rahul started the new movie,  టైసన్ లైన్లోకి వచ్చాడు!
Hero Tyson Rahul started the new movie టైసన్ లైన్లోకి వచ్చాడు!
Advertisement
Ads by CJ

కొత్త సినిమా మొదలు పెట్టిన హీరో టైసన్ రాహుల్

శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ పతాకం పై రాహుల్, చేతన్,సాక్షి చౌదరి,ఐశ్వర్య,యమీ నటీనటులుగా విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో సాయి కార్తీక్,నాగం తిరుపతి రెడ్డి,శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న థ్రిల్లర్, కామెడీ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాల తో ఘనంగా ప్రారంభ మైంది.. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మధుర శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా చిత్ర నిర్మాత లలో ఒకరైన సాయి కార్తీక్   క్లాప్ కొట్టగా, నాగం తిరుపతి రెడ్డి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చిత్ర సహ నిర్మాత శ్రీకాంత్ దీపాల  గౌరవ దర్శకత్వం వహించారు..

పూజ కార్యక్రమాల అనంతరం సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన నేను మొదటి సారిగా శ్రీమతి దివిజా సమర్పణలో  నాగం తిరుపతి రెడ్డి,శ్రీకాంత్ గార్లతో మొదటి సారిగా ప్రొడక్షన్ రంగం లో ఎంటర్ అయ్యాను.ఇదొక డిఫ్రెంట్ ప్రాజెక్టు,  మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను ఆదరించినట్లే ప్రొడ్యూసర్ గా  కూడా ఆదరించి నన్ను ఆశీర్వదించాలని అన్నారు..

నిర్మాత నాగం తిరుపతి రెడ్డి    మాట్లాడుతూ.. సాయి కార్తీక్,శ్రీకాంత్ లు వచ్చి సినిమా చేద్దాం అని చెప్పి, నన్ను ఎలా ఆకర్షించారో ఈ మూవీ కూడా మీ అందరినీ తప్పక ఆకర్షిస్తుంది..ఇప్పటి వరకు నేను 3 సినిమాలు చేసాను ఇప్పుడు ఈ బ్రదర్స్ తో కలసి ఈ మూవీ చేస్తు న్నాను. ఇలాగే మేము ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తామని అన్నారు..

డైరెక్టర్ విరాట్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇది డిఫ్రెంట్ థ్రిల్లర్ కామెడీ సినిమా హీరో,హీరోయిన్లు మా సినిమాకు చక్కగా కుదిరారు.. ఈ మూవీ జనవరి కాంతా చిత్రం పూర్తి చేస్తామని అన్నారు..

సహా నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. బిజినెస్ మ్యాన్ గా తిరుపతి రెడ్డి అన్న అందరికీ సుపరిచితుడు,అటువంటి అన్నగారితో సాయి కార్తీక్ తో కలసి ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగు,కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాము.ఈ మూవీ తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.

హీరో రాహుల్ మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడు నేను చాలా థ్రిల్ అయ్యాను. ఈ సినిమా చూసిన పేక్షకులు కూడా అంతే థ్రిల్ ఫీల్ అవ్వుతారు. ఈ సినిమాకు మంచి దర్శక,నిర్మాతలు దొరికారు. ఈ మూవీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

హీరో చేతన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు కన్నడలో 10 సినిమాలు చేసాను. ఇప్పుడు తెలుగు లో రాహుల్ తో కలసి డిఫ్రెంట్ మూవీ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది..నాకీ ఆవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు దాన్యవాదాలు.

నటీనటులు.. రాహుల్, చేతన్,సాక్షి చౌదరి,ఐశ్వర్య,శరత్ లోహితీశ్వర్,భద్రం,ఇంటూరి వాసు,షకలక శేషు,అన్నపూర్ణమ్మ..

టెక్నీషియన్స్.. బ్యానర్స్య: స్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్, నిర్మాతలు: సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి. సహ నిర్మాత: శ్రీకాంత్ దీపాల, సంగీతం: సాయి కార్తీక్ ఓ.పి. మార్గల్

ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి, ఫైట్ మాస్టర్: అంజి,కె.వి.రమణ, రచన,దర్శకత్వం: విరాట్ చక్రవర్తి.

Hero Tyson Rahul started the new movie:

Hero Tyson Rahul started the new movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ