Advertisementt

గోవాలో ర‌వితేజ!

Thu 03rd Dec 2020 06:53 PM
crack movie,ravi teja,  గోవాలో ర‌వితేజ!
Ravi Teja 'Krack' Movie Lost Schedule in Goa గోవాలో ర‌వితేజ!
Advertisement
Ads by CJ

గోవాలో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని 'క్రాక్' మూవీ లాస్ట్ షెడ్యూల్‌.

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా క్రాక్. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్త‌యిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలింది. గోవాలో శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 4) చివ‌రి షెడ్యూల్ మొద‌ల‌వ‌నున్న‌ది. ఇందులో ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌ల‌పై చివ‌రి పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూరుస్తున్న ఈ పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వ‌నున్న‌ది. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న క్రాక్ లో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాల‌తో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా త‌యార‌వుతోంది. ఇటీవ‌ల ర‌వితేజ‌, అప్స‌రా రాణిపై చిత్రీక‌రించి, విడుద‌ల చేసిన‌ భూమ్ బ‌ద్ద‌ల్ అనే స్పెష‌ల్ సాంగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు.

ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా క్రాక్ మూవీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం: ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి.

సాంకేతిక బృందం: క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని, నిర్మాత‌:  బి. మ‌ధు, బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌, సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె. విష్ణు, డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా, స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి.

Ravi Teja 'Krack' Movie Lost Schedule in Goa:

Ravi Teja 'Krack' Movie Lost Schedule in Goa.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ