Advertisementt

సత్యదేవ్‌ 'తిమ్మరుసు' ఫస్ట్‌ లుక్

Sat 05th Dec 2020 02:30 PM
thimmarusu movie,satyadeva  సత్యదేవ్‌ 'తిమ్మరుసు' ఫస్ట్‌ లుక్
Satyadeva 'Thimmarusu' First Look Release సత్యదేవ్‌ 'తిమ్మరుసు' ఫస్ట్‌ లుక్
Advertisement
Ads by CJ

సత్యదేవ్‌ 'తిమ్మరుసు' ఫస్ట్‌ లుక్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తిమ్మరుసు'. 'అసైన్‌మెంట్‌ వాలి'  ట్యాగ్‌లైన్. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ-  కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. 'తిమ్మరుసు' సినిమా విషయానికి వస్తే ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఈరోజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. వచ్చే నెల విడుదల చేసేందుకు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం అన్నారు.

నటీనటులు: సత్యదేవ్‌, ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, రవి బాబు, అజయ్‌, ప్రవీణ్‌, అంకిత్ కొయ్య, KGF బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు.

సాంకేతిక వర్గం:  సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్, ఎడిటింగ్ : తమ్మిరాజు,

సి జి : అద్విత స్టూడియోస్ అనిల్ పాడూరి, ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె, యాక్షన్‌:  వెంకట్, రియల్ సతీశ్‌, పి.ఆర్‌.ఒ:  వంశీకాక, దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి, నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌.

Satyadeva 'Thimmarusu' First Look Release:

Thimmarusu Movie Next Month Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ