Advertisementt

పూజిత పొన్నాడ `స్పూర్తి` ‌లుక్ విడుద‌ల

Sat 12th Dec 2020 03:20 PM
pujita ponnada,spoorthi,odela railwaystation  పూజిత పొన్నాడ `స్పూర్తి` ‌లుక్ విడుద‌ల
Look of Pujita Ponnada As Spoorthi From 'Odela Railwaystation' పూజిత పొన్నాడ `స్పూర్తి` ‌లుక్ విడుద‌ల
Advertisement
Ads by CJ

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో సూప‌ర్ హిట్ చిత్రాల నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఓదెల రైల్వేస్టేష‌న్. మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన వ‌శిష్ట సింహ, హెబా ప‌టేల్, సాయిరోన‌క్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన విష‌యం తెలిసిందే.. కాగా ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో హీరోయిన్ పూజిత పొన్నాడ న‌టిస్తోంది. తాజాగా ఓదెల రైల్వేస్టేష‌న్ నుండి స్పూర్తిగా పూజిత పొన్నాడ లుక్‌ని రిలీజ్ చేసింది  చిత్ర యూనిట్‌. మెడ‌లో పూల‌దండ‌, తాళితో పెళ్లికూతురుగా ఆహ్లాదంగా ఉన్న పూజిత పొన్నాడ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా..

హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ  - ఈ సినిమాలో స్పూర్తి అనే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం జ‌రిగింది‌. క‌థ‌లో ఈ పాత్ర కీల‌కంగా ఉంటుంది. ఓదెల రైల్వేస్టేష‌న్ త‌ప్ప‌కుండా  నా కెరీర్‌లో ఒక‌ మంచి సినిమా అవుతుంది. రాధామోహ‌న్ గారి శ్రీ‌‌ స‌త్య‌సాయి ఆర్ట్స్  బేన‌ర్‌లో, సంప‌త్ నంది గారి స్క్రిప్ట్‌తో, అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ –  ఈ చిత్రంలో ఒక స్పూర్తివంత‌మైన పాత్ర‌లో హీరోయిన్ పూజిత పొన్నాడ న‌టిస్తోంది. ఆమె లుక్ విడుద‌ల‌చేయ‌డం సంతోషంగా ఉంది. ఓదెల రైల్వేస్టేష‌న్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో వాస్తవికతకు దగ్గిరగా ఈ చిత్రం రూపొందుతోంది అన్నారు.

సంప‌త్ నంది మాట్లాడుతూ - పూజిత పొన్నాడ నటించిన స్పూర్తి పాత్ర జీవితంలో మనందరికీ అవసరమైన ఒక బలమైన పాత్ర‌. పూజిత పొన్నాడ ను నిజ జీవితంలో ఇష్టపడినట్లుగానే ఓదెల రైల్వేస్టేష‌న్ లో స్పూర్తి పాత్ర‌ని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

Look of Pujita Ponnada As Spoorthi From 'Odela Railwaystation':

Look of Pujita Ponnada As Spoorthi From 'Odela Railwaystation' Is Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ