Advertisementt

అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదం.. ఆ పాయింట్ చాలు!

Wed 16th Dec 2020 10:50 PM
valasa movie trailer,p suneel kumar reddy,manoj nandam,valasa telugu movie  అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదం.. ఆ పాయింట్ చాలు!
P Suneel Kumar Reddy Valasa Movie Trailer released అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదం.. ఆ పాయింట్ చాలు!
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా విధించబడ్డ లాక్‌డౌన్ కారణంగా రోడ్డున పడ్డ లక్షలాది మంది కార్మికుల బ్రతుకు చిత్రమే ‘వలస’. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్యా ఫిలిమ్స్ పతాకంపై యక్కలి రవీంద్ర బాబు నిర్మాతగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 16న విడుదల చేశారు. ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరి నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని చిత్రయూనిట్ ప్రకటించింది. కాగా ఈ చిత్రాన్ని జనవరి 1న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా బి. బాపిరాజు రిలీజ్ చేస్తున్నారు.

మనోజ్ నందం, తేజు అనుపోజులు ఒక జంటగా.. వినయ్ మహాదేవ్, గౌరీ మరో జంటగా ఈ చిత్రంలో నటించారు. సమస్యలలో ఉన్నప్పుడు వికసించే మానవ సంబంధాల గురించిన అందమైన విశ్లేషణ ఈ చిత్రంలో ఉంటుందని, సాటి మనిషి కష్టాలలో ఉన్నప్పుడు ముందుకి వచ్చిన మంచితనం గురించి, ఒత్తిడిలో అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పిదాల గురించి ఈ చిత్రంలో అద్భుతంగా తెరకెక్కించామని, ఇది కేవలం వలస కూలీల కష్టాలను ఏకరువు పెట్టే చిత్రం మాత్రమే కాదు.. ఇది వారి ఆత్మ స్థైర్యానికి ఇచ్చిన ఒక సెల్యూట్.. అని చిత్రయూనిట్ తెలిపింది. కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన నరేష్ కుమార్ మడి.. ప్రేక్షకులను కూడా వలస కార్మికులతో కలిసి నడిచే అనుభూతిని కలుగజేస్తారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతంలో స్వరపరిచిన పాట మరియు నేపథ్య సంగీతం చిత్రానికి మరింత జీవం అందించాయని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

ఎఫ్ ఎం బాబాయ్, సముద్రం వెంకటేష్, తులసి రామ్, నల్ల శీను, తనూష డింపుల్, మనీషా, చిన్నారి, ప్రవీర్, వాసు, వెంకట్ రామన్, మల్లికా, రమణి, కనకా రావు, సాజిద్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సహా నిర్మాతలు: శరత్ ఆదిరెడ్డి, రాజా జి, నిర్మాత: యక్కలి రవీంద్ర బాబు, రచన, దర్శకత్వం: పి. సునీల్ కుమార్ రెడ్డి.

Click Here for Trailer

P Suneel Kumar Reddy Valasa Movie Trailer released:

Valasa Movie Trailer Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ