బిగ్ బాస్ మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. ఆదివారం నాగార్జున హోస్ట్ గా గ్రాండ్ ఫినాలేకి బిగ్ బాస్ సిద్ధం కాబోతుంది. ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా చిరునే రాబోతున్నాడని న్యూస్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ చివరి వారంలో కంటెస్టెంట్స్ ఐదుగురిని అందంగా రెడీ చెయ్యడానికి బ్యుటీషియన్స్ హౌస్ లోకి అడుగుపెట్టేవారు. మేకప్ వేసి, హెయిర్ స్టయిల్స్ చేసే బ్యాచ్ ఈసారి కరోనా కారణంగా దూరమయ్యారు. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ పార్టీ కూడా కరోనా కారణముగా ఉండదేమో అని ఫీలవుతున్నారు. కానీ తాజాగా బిగ్ బాస్ పార్టీ ఉన్నట్లుగా లేటెస్ట్ ప్రోమోలో రివీల్ చేసింది యాజమాన్యం.
బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్, అరియనాలు ఉంటే.. వారం వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ పార్టీ ఆరంజ్ చేసింది. కాకపోతే కంటెస్టెంట్స్ మధ్యలో గ్లాస్ ఉండేలా అంటే గతంలో బిగ్ బాస్ సభ్యుల తల్లితండ్రులు వచ్చినప్పుడు మధ్యలో గ్లాస్ రూమ్ పెట్టి వాళ్ళని లోపలికి వదిలినట్టుగా ఇప్పుడు కూడా గ్లాస్ రూమ్ లోకే ఎలిమినేటెడ్ బ్యాచ్ ని వదిలింది.. హౌస్ లోని వారితో పార్టీ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మోనాల్, లాస్య, గంగవ్వ, కళ్యాణి, దివి లు బిగ్ బాస్ గ్లాస్ రూమ్ లోకి వచ్చేసారు. ఇక అఖిల్ మోనాల్ ని చూడగానే ఆనందమే ఆనందం. మరి రేపు ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో తేలిపోనుంది.