Advertisementt

'తానే నేనో' పాటకు అద్భుత స్పందన!

Thu 24th Dec 2020 03:51 PM
thane nano song,nede vidudala movie  'తానే నేనో' పాటకు అద్భుత స్పందన!
Awesome response to the song Thane Nano 'తానే నేనో' పాటకు అద్భుత స్పందన!
Advertisement
Ads by CJ

కొత్త దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వంలో అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటిస్తున్న సినిమా నేడే విడుదల. తాజాగా ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని తెలియజేసారు. ఈ సాంగ్ వన్ లాక్ జెన్యూన్ వ్యూస్ తో పాటు, ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమా సాంగ్ కి కూడా రాని లైక్స్ అండ్ కామెంట్స్ మా సినిమాకు వచ్చాయి అని, దీనంతటికి కారణం మేము శ్రీకారం చుట్టిన కొత్త ప్రచార మార్గమే అని, డైరెక్ట్ గా ఒక కాంటెస్ట్ పెట్టి ప్రేక్షకుల చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ అండ్ సాంగ్ ని రిలీజ్ చేసాం అని తెలియజేసారు. అది ఇప్పుడు జనాల్లో వైరల్ అయి మేము ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి ఇంకా మెసేజ్ లు, వీడియో లు వస్తున్నాయి అని చెప్పారు.  

కాగా వైరల్ అవుతున్న తానే నేనో పాటను శ్రీమణి రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడా సంగీతం సమకూర్చారు. కాశి విశ్వనాథ, అప్పాజీ అంబరీషా, మాధవి, అదుర్స్ ఆనంద్, అశోక్ వర్ధన్, పీలా గంగాధర్ వంటి నటీనటులు నటించిన ఈ సినిమాకు ఆర్ట్ సి హెచ్ రవికుమార్, కెమెరా సి హెచ్  మోహన్ చారి, ఎడిటింగ్ సాయి బాబు తలారీ, నిర్మాతలు ఏ మస్తాన్ ఖాన్, ఏ నజురుల్లా ఖాన్, రచన దర్శకత్వం రామ్ రెడ్డి పన్నాల.

Awesome response to the song Thane Nano :

Awesome response to the song Thane Nano from Nede Vidudala Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ