Advertisementt

గ్లామర్ ఉంటే చాలా?

Mon 28th Dec 2020 03:57 PM
monal gajjar,monal gajjar dance plus  గ్లామర్ ఉంటే చాలా?
The Star maa gave Monal a chance again just for the glamor గ్లామర్ ఉంటే చాలా?
Advertisement
Ads by CJ

నిజంగా చాలామంది హీరోయిన్స్ గ్లామర్ షో చేస్తే కెరీర్ లో సెటిల్ అవుతారు. కొంతమంది ఎంత చూపించినా కెరీర్ లో సెటిల్ కాలేరు. ఒకప్పుడు అల్లరి నరేష్ తో రెండు సినిమాలు చేసి.. లైం టైం లో లేకుండా పోయిన మోనాల్ గజ్జర్ ప్రస్తుతం గ్లామర్ షో ద్వారానే కెరీర్ లో సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. అల్లరి అరెష్ తో చేసిన సినిమాలతో ఫెమ్ తెచ్చుకోలేని మోనాల్ బిగ్ బాస్ లోకి ఆడుగుపెట్టి గ్లామర్ షో చేస్తూ తెగ ఫెమస్ అయ్యింది. మోనాల్ గజ్జర్ ని కేవలం గ్లామర్ కోసమే స్టార్ మా బిగ్ బాస్ యాజమాన్యం 14 వారాల పటు బిగ్ బాస్ హౌస్ లో ఉంచారు. లేదంటే మోనాల్ ఐదారు వారాలకే ఎలిమినేట్ అయ్యిపోయేది. వారం వారం నాగ్ ఎపిసోడ్స్ లో మోనాల్ గజ్జర్ గ్లామర్ షో ఆమెని హౌస్ లో  14 వారాల పాటు ఉండేలా చేసింది.

ఈ గ్లామర్ కోసమే మోనాల్ కి స్టార్ మా మళ్ళీ అవకాశం ఇచ్చింది. 14 వ వారంలో అంటే చివరి వారం వరకు మోనాల్ గ్లామర్ ని వాడిన స్టార్ మా మళ్లీ డాన్స్ ప్లస్ తో మోనాల్ గ్లామర్ ని వాడేస్తుంది. మోనాల్ గజ్జర్ గ్లామర్ తారగా డాన్స్ ప్లస్ షో లో మెంటర్ స్థానంలో అదరగొట్టేస్తుంది. ఓం కార్ అన్నయ్యతో, బాబా భాస్కర్ మాస్టర్ తో పంచ్ లు వేస్తూ మోనాల్ గజ్జర్ డాన్స్ ప్లస్ స్టేజి మీద హడావిడి చేస్తుంది. బిగ్ బాస్ లో మోనాల్ వలన స్టార్ మాకి వచ్చిన తలనొప్పులు అన్ని ఇన్ని కావు.  స్టార్ కి బిగ్ బాస్ కి దత్త పుత్రిక మోనాల్ అన్నాసరే స్టార్ మా పట్టించుకోలేదు. తాజాగా బిగ్ బాస్ లో మోనాల్ గ్లామర్ వాడింది చాలదు.. మళ్ళీ కావాలి అంటూ డాన్స్ ప్లస్ కోసం మోనాల్ ని తీసుకొచ్చారు. మరి మోనాల్ పెద్ద డాన్సర్ కాదు.. అయినా ఆమె గ్లామర్ కోసం స్టార్ మా మోనాల్ ని ఆ షో కోసం తీసుకుంది.

The Star maa gave Monal a chance again just for the glamor:

Monal Gajjar Dance Plus makes a rush on stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ