టెంపర్ తర్వాత ఎన్ని సినిమాలు ప్లాప్ లు పడినా ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ తానేమిటో నిరూపించుకున్నాడు పూరి జగన్నాద్. ఇస్మార్ట్ హిట్ తో మరోసారి మాస్ ప్రేక్షకులని ఆకట్టుకున్న పూరి కి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడానికి జంకినా.. విజయ్ దేవరకొండ మాత్రం పూరి కథకి కమిట్ అవడమేనా.. ఫ్యాన్ ఇండియాకి తీసుకెళ్లాడు పూరీని. పూరి తో సినిమా అంటేనే కంగారు పడిన హీరోలందరికీ విజయ్ షాకిచ్చాడు. విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న పూరి ఇప్పుడు విజయ్ దేవరకొండని పొగిడేస్తున్నాడు. కరొనతో బ్రేకులు పడిన ఫైటర్ షూటింగ్ రేపోమాపో మొదలు కాబోతుంది. ప్రస్తుతం పూరి సినిమా కోసం విజయ్ దేవరకొండ జిమ్ లో వర్కౌట్స్ తో కష్టపడుతున్నాడు.
షూటింగ్ కి బ్రేక్ వచ్చినా విజయ్ కి జిమ్ కష్టాలు తప్పలేదు. కారణం బాక్సర్ గా విజయ్ ఫిట్ గా కనబడాలి. అయితే తాజాగా జిమ్ వర్కౌట్ లో ఉన్న విజయ్ దేవరకొండ వీడియో ని షేర్ చేసిన పూరి దటీజ్ మై హీరో.. దటీజ్ మై ఫైటర్. నువ్వు నన్ను గర్వపడేలా చేశాడు. ఐ లవ్ యూ విజయ్. అంతో ట్వీట్ చేయడంతో నిజంగానే పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చాడు.. తన కథని నమ్మి సినిమా చేస్తున్నాడు. అలాగే కథ కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. అందుకే పూరి విజయ్ ని అలా చూడగానే దటీజ్ మై హీరో.. అంటున్నాడు.