Advertisementt

న్యూట్రాన్ గ్రూప్ ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో!

Tue 29th Dec 2020 08:10 PM
mee women fashion show,neutron group  న్యూట్రాన్ గ్రూప్ ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో!
Your Women Fashion Charity Show under the auspices of Neutron Group! న్యూట్రాన్ గ్రూప్ ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో!
Advertisement
Ads by CJ

న్యూట్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో!

రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్‌లో న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ సాహిత్య యనమదల, సిమ్రన్ కౌర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న చారిటీ షో మీ వుమెన్ ఫ్యాషన్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ మోడల్స్‌ పాల్గొన్న ఈ ర్యాంప్ వాక్ షో అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. అబ్దుల్ సర్వార్ కొరియోగ్రాఫ‌ర్‌గా.. తైరీన్ బసిరికట్టి, ముఖేష్ దుబే డిజైనర్లుగా.. ఫెమినా లదానీ మేకప్ ఆర్టిస్ట్‌గా.. వీజే రాఖీ హోస్ట్‌ చేసిన ఈ షోలో మోడల్స్ తమ సోయగాలతో ఆహుతులను అలరించారు. అనంతరం హైదరాబాద్ మహానగరంలో ఇంత పెద్ద చారిటీ షోని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని న్యూట్రాన్ డైరెక్టర్స్ తెలిపారు. మున్ముందు ఇలాంటి షోలు మరిన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇంత పెద్ద షోకి ముఖ్యఅతిథిగా రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, మోడల్స్ ధరించిన డిజైన్స్, టోటల్ షో.. ఎంతగానో అలరించిందని రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ తెలిపారు. షో అనంతరం పేదలకు న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ చెక్కుల పంపిణీ చేశారు. 

Your Women Fashion Charity Show under the auspices of Neutron Group! :

Mee Women Fashion Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ