Advertisementt

కిరణ్ తో సమ్మతమే అంటోన్న చాందిని చౌదరి

Tue 19th Jan 2021 09:02 PM
kiran abbavaram,chandini chowdary,gopinath reddy,k praveena,sammathame  కిరణ్ తో సమ్మతమే అంటోన్న చాందిని చౌదరి
Kiran Abbavaram Film Titled Sammathame కిరణ్ తో సమ్మతమే అంటోన్న చాందిని చౌదరి
Advertisement
Ads by CJ

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి, గోపీనాథ్ రెడ్డి, కె. ప్ర‌వీణ కాంబినేష‌న్ ఫిల్మ్ టైటిల్ స‌మ్మ‌త‌మే

రాజావారు రాణివారు సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు స‌మ్మ‌త‌మే అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

క‌ల‌ర్ ఫొటో లో హీరోయిన్‌గా త‌న క్యూట్ ప‌ర్ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చాందిని చౌద‌రి ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం జోడీగా న‌టిస్తున్నారు. యు.జి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. ప్ర‌వీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సోమ‌వారం స‌మ్మ‌త‌మే టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఓ యువ‌తి స్తంభానికి క‌ట్టేసి ఉంటే, వెనుక శ్రీ‌కృష్ణుడు క‌నిపిస్తున్నాడు. చాలా ఆహ్లాద‌క‌రంగా ఆక‌ట్టుకుంటోంది ఈ పోస్ట‌ర్‌. ల‌వ్ ఈజ్ అన్‌కండిష‌న‌ల్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నే ఆస‌క్తి రేకెత్తుతోంది. స‌మ్మ‌త‌మే అంటే అంగీకారం అనే విష‌యం మ‌న‌కు తెలుసు.

ల‌వ్ డ్రామా మేళ‌వించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, స‌తీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. విప్ల‌వ్ నైష‌దం ఎడిట‌ర్ కాగా, సుధీర్ మాచ‌ర్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

త్వ‌‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ది.

Kiran Abbavaram Film Titled Sammathame:

Kiran Abbavaram - Chandini Chowdary Film Titled Sammathame

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ