Advertisementt

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన ప్రదీప్

Mon 11th Jan 2021 12:03 PM
pradeep machiraju,30 rojullo preminchatam ela,release date,january 29th,anchor pradeep,neeli neeli akasam song,record views,amrutha aiyer,siva narayana,hema,posani krishna murali,subhalekha sudhakar,viva harsha  ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన ప్రదీప్
30 Rojullo Preminchatam Ela Releasing date confirmed ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన ప్రదీప్
Advertisement
Ads by CJ

ప్ర‌దీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా జ‌న‌వ‌రి 29 విడుద‌ల‌

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ ద‌గ్గ‌ర ఆర్య 2, 1.. నేనొక్క‌డినే చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు.

అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత‌లు ఇప్ప‌టివ‌ర‌కూ మూడు పాట‌ల‌ను విడుద‌ల చేశారు. మూడింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ప్ర‌త్యేకించి నీలి నీలి ఆకాశం పాట సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించి, ఇప్ప‌టివ‌ర‌కూ 218 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం పెద్ద విశేషం. పాట‌ల‌న్నింటినీ చంద్ర‌బోస్ రాశారు.

లేటెస్ట్‌గా ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌తో సినిమా విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌వుతోంది. నీలి నీలి ఆకాశం పాట ఎలాగైతే ఆక‌ట్టుకుందో, సినిమా కూడా ప్రేక్ష‌కుల్ని అలాగే అల‌రిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.

దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, కార్తీక్ శ్రీ‌నివాస్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

తారాగ‌ణం:

ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌, శివ‌న్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా హ‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌.

30 Rojullo Preminchatam Ela Releasing date confirmed:

Pradeep Machiraju 30 Rojullo Preminchatam Ela Releasing On January 29th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ