Advertisementt

గ్యాంగ్ స్టర్ గంగరాజు మొదలెట్టాడు!

Sat 23rd Jan 2021 02:20 PM
gangster gangaraju movie,gangster gangaraju starts regular shooting  గ్యాంగ్ స్టర్ గంగరాజు మొదలెట్టాడు!
Gangster Gangaraju starts regular shooting గ్యాంగ్ స్టర్ గంగరాజు మొదలెట్టాడు!
Advertisement
Ads by CJ

లక్ష్ హీరోగా గ్యాంగ్ స్టర్ గంగరాజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!!

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా.. ప్రతిభగల యువదర్శకులను  ప్రోత్సహిస్తూ.. ప్రేక్షకులకు డిఫరెంట్  కథాచిత్రాలను అందిస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్, రీసెంట్ గా వలయం వంటి థ్రిల్లర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. తాజాగా లక్ష్ హీరోగా వేదిక దత్తు హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం  ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చె లా గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రాన్ని రూపొందుస్తున్నారు.  క్యాచీ టైటిల్ తో.. అద్భుతమైన కథాంశంతో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్   ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ  సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.. న్యూ డైమెన్షన్ క్యారెక్టర్ లో లక్ష్ హీరోగా నటిస్తున్నారు. సుప్రీం, రాజా ది గ్రేట్, వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న  సాయి కార్తీక్ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ప్రముఖ నటీ నటులు యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం జనవరి 22న హైదరాబాద్ లో  పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు గారు క్లాప్ ఇచ్చారు.. ఈ రోజు నుండి హైదరాబాద్, అరకు, ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగే రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేయనున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్; సాయి కార్తీక్, డివోపి; కన్నా పి.సి, ఎడిటర్; అనుగోజు రేణుక బాబు, పీఆర్ఓ; సాయి సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; భరత్ వెనిగళ్ల. నిర్మాత; పద్మావతి చదలవాడ, దర్శకత్వం; ఇషాన్ సూర్య.

Gangster Gangaraju starts regular shooting:

Gangster Gangaraju starts regular shooting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ