Advertisementt

బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ కు సుధీర్ బాబు సపోర్ట్!

Sun 24th Jan 2021 08:58 PM
bomma blockbuster movie,third song released  బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ కు సుధీర్ బాబు సపోర్ట్!
Nadikudi Railanti song from Bomma Blockbuster out now బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ కు సుధీర్ బాబు సపోర్ట్!
Advertisement
Ads by CJ

వెర్స‌టైల్ హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా విడుద‌లైన విజ‌యూభ‌వ ఆర్ట్స్, నందు, రష్మీ  కాంబినేష‌న్ మూవి బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ సెకండ్ సింగిల్.  

విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరుని సంపాయించిన నందు విజ‌య్‌కృష్ణ హీరోగా, యాంక‌ర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ చిత్రాన్ని విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక‌ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ విడుద‌ల‌య్యి మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ నేప‌థ్యంలో మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారేవురురా చిత్రాల ద్వారా మంచి స‌క్స‌స్ ని సాంధించి ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా అంటే సుంద‌రానికి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించిన న‌డ‌కుడి రైటంటి సోద‌రా అంటూ సాగే పాటను తాజాగా వెర్స‌టైల్ హీరో సుధీర్ బాబు విడుద‌ల చేశారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుల‌వుతుంది. 

ఈ సంద‌ర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం టీజ‌ర్ ని చూసినప్పుడే ప్రామిసింగ్ గా అనిపించింది. ఈ చిత్రం లో నందు కొత్తగా క‌నిపిస్తున్నాడు. కేర‌క్ట‌ర్ కూడా ఇంట్ర‌స్టింగ్ వుంది. ఇప్పుడు నాతో రెండ‌వ సాంగ్ లాంచ్ చేయించారు. ఈ సాంగ్ కి ప్ర‌త్యేక‌త వుంది అదేంటంటే మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారేవురు చిత్రాల‌తో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించ‌టం. వివేక్ ఆత్రేయ చిత్రాలు చూశాను. చాలా నేచుర‌ల్ గా చిత్రాలు తీసి మెప్పిస్తున్నారు. ఇప్ప‌డు ఆయ‌న్లో మ‌రో యాంగిల్ ఇది ఈ పాట‌లో ఆయ‌న రాసిన లిరిక్స్ న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ల్టిటాలెంటెడ్ ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ఇలా మ‌ల్టిటాలెంటెడ్ ప‌ర్స‌న్స్ ఇండ‌స్ట్రికి రావ‌టం శుభ‌ప‌రిణామం. అంతేకాకుండా ఈ పాట‌ని ప్ర‌ముఖ సింగ‌ర్ వైకామ్ విజ‌య‌ల‌క్ష్మి గారు పాడ‌టం హైలెట్ గా నిలిచింది.  ఈ చిత్రం నందు కి , ద‌ర్శ‌కుడు రాజ్ విరాఠ్ కి కెరీర్ పెద్ద బ్రేక్ అవ్వాల‌ని కొరుకుంటున్నాను. ప్రోడ్యూస‌ర్స్ కి చాలా మంచి ప్రాఫిట్స్ రావాల‌ని వారు మ‌రిన్ని చిత్రాలు తీయాల‌ని కొరుకుంటున్నాను. అన్నారు

న‌టీన‌టులు: నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్, కిరిటి, ర‌ఘు కుంచె త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్, పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్, పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే, ఎడిటర్ : బి. సుభాష్కర్, మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి, నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు, నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ, రచన - దర్శకత్వం : రాజ్ విరాట్.

Nadikudi Railanti song from Bomma Blockbuster out now:

Bomma Blockbuster third song released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ