ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై, PVS రామ్మోహన్ మూవీస్, తృప్తి రిసార్ట్స్ సహకార సారథ్యంలో ఎస్.ఎస్. పట్నాయక్ రచన,దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ మరియు PVS రామ్మోహన్ రావు సహనిర్మాతలు గా నిర్మితమైన పద్మశ్రీ సినిమా లోగోని ఇటీవల తెలుగు వన్ MD కంటమనేని రవిశంకర్ గారు ఆవిష్కరించగా, ఫస్ట్ లుక్ ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు గారి చేతుల మీదగా ఆవిష్కరణ జరిగినది.
గ్రాఫిక్స్ తో పాటు కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హర్రర్ మూవీగా రూపుదిద్దుకున్న పద్మశ్రీ చిత్రాన్ని హైదరాబాద్, ఆలంపూర్ లో కొంత భాగాన్ని చిత్రీకరించగా, ఉత్తరాంధ్ర జిల్లాలలో తృప్తి రిసార్ట్స్ పరిధిలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగిందని ప్రస్తుతం D.I., 5.1 ఫైనల్ మిక్సింగ్ దశలో ఉందని డైరెక్టర్ ఎస్ఎస్ పట్నాయక్ తెలియపరిచారు.
నటీనటులు: పక్కి కిషోర్, సతీష్ పట్నాయక్, అల్లెన్ హర్ష, డా. ప్రవీణ్, చక్రవర్తి, కనిక కన్నా, రమ్య, సంధ్యారాణి, మాధురి, జయశ్రీ మరియు జ్యోతి ప్రధాన పాత్ర దారులుగా నటించిన ఈ చిత్రానికి ఇతర సాంకేతిక వర్గం: ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, ఎడిటింగ్: కంబాల శ్రీనివాసరావు, ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వరరావు, ఫైట్స్: దేవరాజు మాస్టర్, సంగీతం: జాన్ పోట్ల, డాన్స్: వెంకట్, తారక్, లిరిక్స్: బాసంగి సురేష్ కుమార్, డబ్బీరు గోవిందరావు, మెండెం శ్రీధర్
ఫైనాన్షియల్ అడ్వైజర్స్: పక్కి సురేష్, హారిక కృష్ణ.