Advertisementt

ఎట్టకేలకి ఉప్పెనకి మోక్షం వచ్చింది

Tue 26th Jan 2021 05:44 PM
vaishnav tej,buchi babu sana,uppena movie,release date,february 12th  ఎట్టకేలకి ఉప్పెనకి మోక్షం వచ్చింది
Uppena Release date locked ఎట్టకేలకి ఉప్పెనకి మోక్షం వచ్చింది
Advertisement
Ads by CJ

ఫిబ్ర‌వ‌రి 12న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న పంజా  వైష్ణ‌వ్ తేజ్‌, బుచ్చిబాబు సానాల‌ ఉప్పెన‌

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ఉప్పెన‌. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.  బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని విడుద‌ల తేది ఖారార‌య్యింది. ఫిబ్ర‌వ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

ఇప్పటికే సంగీతంలో త‌న‌ అభిరుచికి, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన  విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా  ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవ‌ల రిలీజైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి వారి స్క్రీన్ ప్ర‌జెన్స్‌తో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నారు. ఈ టీజ‌ర్‌తో ఉప్పెన‌పై అంచ‌నాలు భారీగా పెరిగాయి.

దేవి శ్రీప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన  అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తారాగ‌ణం:

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

Uppena Release date locked:

Vaishnav Tej, Buchi Babu Sana’s Uppena Releasing On February 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ