క్లీన్ యు/ ఎ గా వస్తున్న చెప్పినా ఎవరూ నమ్మరు చిత్రం గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్.
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి ``` శ్రీనివాసులు నిర్మించిన చెప్పినా ఎవరూ నమ్మరు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా.. సినిమా హీరో & డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ మాట్లాడుతూ ...మా నిర్మాత మురళి శ్రీనివాస్ గారు చాలా పెయిన్ తీసుకొని ఖర్చుకు వెనుకాడకుండా,ప్యాసినెట్ గా సినిమాను ఇక్కడిదాకా తీసుకొచ్చారు.మేము అనుకున్న మైల్ స్టోన్ ను చేరుకొని మా నిర్మాతకు మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాము.జి.నాగేశ్వర్ రెడ్డి,కరణం నాగేందర్ గార్ల పర్యవేక్షణ లోనే ఈ సినిమా తీయడం జరిగింది.మా సినిమాను మూవీ మాక్స్ అధినేత శ్రీనివాస్ గారి ద్వారా ఈ నెల 29 న విడుదల చేస్తున్నాము.వారి ఎఫెక్ట్ తో మా సినిమాకు ఎక్కువ థియేటర్ లు ఇప్పించారు. వారికి నా కృతజ్ఞతలు.మేము విడుదల చేసిన పాటలకు,ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంశలు వచ్చాయి.ఈ నెల 29 న వస్తున్న మా సినిమా ప్రేక్షకులు అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రం ఈ రోజు పెద్ద సినిమాగా మారబోతుంది.మంచి కంటెంట్ తో, ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విదంగా వస్తున్న ఇటువంటి మూవీ ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ.పి,తెలంగాణ లలో ఈ సినిమాకు మంచి థియేటర్స్ దొరికాయి.ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ… మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మొట్ట మొదటగా వస్తున్న థ్రిల్లింగ్,క్రైమ్,యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ గా వస్తున్న యూత్ ఫుల్ మూవీ చెప్పినా ఎవరు నమ్మరు. మేము విడుదల చేసిన పాటలకు మంచి వ్యూస్ వచ్చాయి. ఇందులో మేము న్యాచురల్ సీన్స్ తో రియలిస్టిక్ గా తీశాం. యూత్ కు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నందున సినిమాను చూసిన యూత్ అంతా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.మా సినిమాకు మంచి థియేటర్స్ అందించిన డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.మాకు సహకరించిన నాగేశ్వర్ రెడ్డి,కరణం దేవేందర్ లకు ధన్యవాదాలు.ఈ నెల 29 న విడుదల అవుతున్న మా చిత్రం ప్రేక్షకుల మన్నన పొందుతుందని అన్నారు..
హీరోయిన్ సుప్యార్ధే సింగ్ మాట్లాడుతూ... నాకు తెలుగు రాకున్నా చిత్ర యూనిట్ అందరూ సపోర్ట్ చేయడం తో ఈ మూవీ చేయగలిగాను వారందరికీ నా ధన్యవాదాలు అని అన్నారు..
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ కృష్ణ,కరణం దేవేందర్,రాజేష్, గురుకుమార్ తదితరులు పాల్గొని చిత్రం గణ విజయం సాధించేలా ప్రేక్షకులు ఆశీర్వదించాలని అన్నారు..
తారాగణం: ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు
సాంకేతిక విభాగం: బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్, నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు, డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ, సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి, సంగీతం: జగదీశ్ వేముల, ఎడిటర్: అనకల లోకేష్, లిరిక్స్: భాస్కరభట్ల, రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్, పి. ఆర్. ఓ: మధు వి.ఆర్.