Advertisementt

సితార బ్యానర్ లో నరుడి బ్రతుకు నటన

Sun 31st Jan 2021 03:13 PM
narudi brathuku natana movie,narudi brathuku natana movie pooja ceremony,p.d.v prasad,s. radha krishna (chinababu),vimal krishna,siddu jonlagadda   సితార బ్యానర్ లో నరుడి బ్రతుకు నటన
Narudi Brathuku Natana Movie Pooja Ceremony సితార బ్యానర్ లో నరుడి బ్రతుకు నటన
Advertisement
Ads by CJ

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా సితార ఎంటర్టైన్ మెంట్స్ నరుడి బ్రతుకు నటన చిత్రం ప్రారంభం

ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు, కథానాయికగా నేహాశెట్టి ఫిబ్రవరి 4 నుంచి నరుడి బ్రతుకు నటన  చిత్రం రెగ్యులర్ షూటింగ్ టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 

కథానాయికగా నేహాశెట్టి నటిస్తున్న ఈ చిత్రం నేడు ప్రారంభమయ్యింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు జరిగాయి. చిత్ర నాయకా, నాయికలు సిద్ధు జొన్నలగడ్డ,నేహాశెట్టి ల పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి హారిక అండ్  హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గారు పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్  హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గారు చిత్ర దర్శక,నిర్మాతల కు చిత్రం స్క్రిప్ట్ ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్  ఫిబ్రవరి 4 నుంచి  ప్రారంభం అవుతుంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు దర్శకుడు విమల్ కృష్ణ. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. 

రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని, పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం: విమల్ కృష్ణ.

Narudi Brathuku Natana Movie Pooja Ceremony :

Narudi Brathuku Natana Movie start shooting from Feb 4th.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ