Advertisementt

టుడే మూవీ అప్ డేట్స్

Mon 01st Feb 2021 08:27 PM
movie up dates,republic movie release date,sashi movie news,chakra movie release date  టుడే మూవీ అప్ డేట్స్
Today Movie Updates టుడే మూవీ అప్ డేట్స్
Advertisement
Ads by CJ

జూన్ 4న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా చిత్రం రిప‌బ్లిక్‌

వైవిధ్యమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే యువ హీరోల్లో సుప్రీమ్ హీరో సాయితేజ్ ముందు వరుసలో ఉంటారు. అందువ‌ల్లే చిత్రల‌హ‌రి, ప్ర‌తిరోజూ పండ‌గే. సోలో బ్రతుకే సో బెటర్ వంటి వ‌రుస విజయాల‌ను సాయితేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం రిప‌బ్లిక్‌. ప్రస్థానం వంటి డిఫరెంట్ పొలిటిక‌ల్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలోరిప‌బ్లిక్‌ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు  మాట్లాడుతూ - ‘సాయితేజ్ హీరోగా దేవ్ క‌ట్టా‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రిప‌బ్లిక్‌ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం అన్నారు. 

ఫిబ్ర‌వ‌రి19న నాలుగు సౌత్ఇండియ‌న్ లాంగ్వేజెస్‌ విడుద‌ల‌కానున్న‌ యాక్ష‌న్ హీరో విశాల్ చ‌క్ర.

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం చ‌క్ర‌.  శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక  ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు.

ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాషల్లో  విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.ఈ సంద‌ర్భంగా..

యాక్ష‌న్ హీరో విశాల్ మాట్లాడుతూ -ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చ‌క్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న నాలుగు సౌత్ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

ఒకే ఒక లోకం పాట లాగే శశి సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- డైలాగ్ కింగ్ సాయికుమార్

లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా, అందాల భామ సురభి హీరోయిన్ గా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం శశి. ఇటీవల ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక లోకం నువ్వే  పాట సంగీత ప్రియులను అలరిస్తూ.. ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది ఈ పాటను రింగ్ టోన్స్ గా ఉపయోగిస్తున్నారు. అంతలా రీచ్ అయి 21మిలియన్స్ దాటి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యువ సంగీత కెరటం అరుణ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఒకే ఒక లోకం నువ్వే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.

ఈ సందర్భంగా ఒకే ఒక లోకం పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ఫిబ్రవరి 1న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ సురభి, దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నందికట్ల, సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామెన్ అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్ పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ప్లాటినమ్ డిస్క్ లను సాయికుమార్ చిత్ర యూనిట్ కు అందించారు.

దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నందికట్ల మాట్లాడుతూ.. ఒకే ఒక లోకం నువ్వే పాట 21మిలియన్స్ వ్యూస్ పైగా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతలా ఆదరిస్తున్న మ్యూజిక్ లవర్స్, ప్రేక్షకులకు నా థాంక్స్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా అరుణ్, చంద్రబోస్ గారికే దక్కుతుంది. సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.

హీరోయిన్ సురభి మాట్లాడుతూ.. వెరీ వెరీ స్పెషల్ డే. పాట బిగ్ హిట్ అవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. చంద్రబోస్ మంచి లిరిక్స్, అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. వారికి నా థాంక్స్. సిద్ శ్రీరామ్ గ్రేట్ సింగర్. సూపర్బ్ గా పాడారు. ఆదితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే నిర్మాత వర్మ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శ్రీనివాస్ నాయుడు ఫెంటాస్టిక్ గా మూవీ తెరకెక్కించారు. తప్పకుండా శశి చిత్రం బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ఒకే ఒక పాటని చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకున్నారు. ఈ విషయం నేను ప్రత్యక్షంగా చూశాను. సాంగ్ చాలా పెద్ద అయి 21 మిలియన్స్ వ్యూస్ రావడం సప్రయిజ్ గా ఉంది. ఇంతలా ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ గారు ఫస్ట్ టైమ్ నాకు పాట రాశారు. గొప్పగా ఆలపించిన సిద్ శ్రీరామ్ కి స్పెషల్ థాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చ్ 19న శశి మూవీ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. రియల్ సతీష్ నేచురల్ గా ర గా ఉండేలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సురభి అందంతో పాటు  మంచి టాలెంటెడ్ యక్ట్రెస్. అమర్ ప్రతి ఫ్రెమ్ అందంగా తీర్చిదిద్దారు. చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేసి.. విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి.. అని బ్లెస్స్ చేశారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. అన్నారు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. నిర్మాత వర్మ నాకు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్.. బేసిగ్గా అతను డిస్ట్రిబ్యూటర్. మంచి కథతో ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారు. రీసెంట్ గా నేను పోలీస్ స్టోరీ 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఒక లోకం నువ్వే పాటని కన్నడలో తర్జుమా చేసి బాగా ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. అలాగే తమిళనాడులో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. తప్పకుండా శశి పాట లాగే పెద్ద హిట్ అవుతుంది అని అందరూ ఫోన్స్ చేసి చెపుతున్నారు. అరుణ్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ సూపర్బ్ లిరిక్స్ రాశారు. ఆది కేరియర్ బెస్ట్ సాంగ్ ఇది. 21 మిలియన్స్ పైగా రీచ్ అయింది. నేను చాలా ఎగ్జైట్ గా వున్నాను.  పాట కన్నా శశి  పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. అన్నారు.

మంత్రి హ‌రీశ్ రావుగారు చేతులు మీదుగా రావ‌ణ‌లంక టీజ‌ర్ విడుద‌ల‌

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌.  క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రావ‌ణ‌లంక ఆడియోకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇది ఇలా ఉండ‌గా నేడు మంత్రి హ‌రీశ్ రావుగారు రావ‌ణ‌లంక టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. పూర్తి క‌మ‌ర్షీయ‌ల్, ఎంట‌ర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజ‌ర్ ని రెడీ చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కునే రీతిన రావ‌ణ‌లంకని తీర్చిదిద్దిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు బి.ఎన్.ఎస్.రాజు తెలిపారు. ఫ్రిబ‌వ‌రిలో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత, హీరో క్రిష్ తెలిపారు.

టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ

హీరో క్రిష్ నాకు బాగా తెలుసు, రావణ లంక సినిమా గురించి మాట్లాడుతూ సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయని క్రిష్‌ చెప్పేవాడు, ఇప్పుడు చూస్తుంటే నిజం అనిపిస్తుంది. అతనికి మంచి భవిషత్తు ఉండాలని కోరుకుంటున్న అన్నారు. రేపు థియేటర్స్ లో కూడా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్న అన్నారు.

టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్  Tempt రాజా

సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా Tempt  రాజా. టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్  సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను  విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ...

Tempt రాజా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్,  మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ బాగా ఆదరించారు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ కి ఇంకా బాగా రెస్పాన్స్ వస్తోంది. ఎంతలా అంటే... 10 రోజుల్లో మా సినిమా బిజినెస్ ని క్లోజ్ చేసే అంతలా ఈ టీజర్ కి బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. హీరోయిన్ లు  దివ్య రావ్, ఆస్మ లు చాలా బాగా నటించారు. వీళ్ళతో పనిచేయడం నాకు కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో ఎల్దీ గా  తన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఆయకు ధన్యవాదాలు. ఇది మహిళల ఇమేజ్ ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం.  తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు మా Tempt రాజా.

విక్రాంత్ రోణ‌తో సినిమా చరిత్రలో సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేయనున్న శాండిల్ వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్‌ 

శాండిల్‌వుడ్‌ బాద్‌షా నటుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ టైటిల్‌ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేశారు. ఈ వేడుక ఆదివారం(జనవరి 31) రాత్రి 9 గంటలకు కిచ్చా క్రియేషన్స్, యూ ట్యూబ్‌ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఇప్పటికే  సినీ పరిశ్రమలో సిల్వర్‌జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసిన సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌.. విక్రాంత్ రోణ‌తో సరికొత్తగా పరిచయం అయ్యారు. 

ఆసక్తికరమైన విషయమేమంటే కోవిడ్‌ ప్రభావం తర్వాత షూటింగ్‌ను స్టార్ట్‌ చేసిన భారీ బడ్జెట్‌ మూవీ విక్రాంత్ రోణ‌. సుదీప్‌ అంకిత భావం.. సినిమా సరిహద్దులు మార్చి, భారీ స్థాయిలో సినిమాను రూపొందించడానికి దోహదపడింది. దుబాయ్‌లోని ఆకాశ హర్మ్యం బుర్జ్‌ ఖలీఫాలో విక్రాంత్ రోణ‌ టైటిల్‌ లోగో, స్నీక్‌ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త ఆధ్యాయానికి కిచ్చా సుదీప్‌ శ్రీకారం చుట్టారు. 

గ్రాండ్‌ లెవల్లో జరిగిన విక్రాంత్ రోణ‌ టైటిల్‌ లోగో, స్పీక్‌ పీక్‌ రిలీజ్‌ వేడుకకు బుర్జ్‌ ఖలీఫా భవంతి సాక్ష్యంగా నిలిచింది. ఇండియన్‌ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటే ఘట్టమిది. ఎందుకంటే మూడు నిమిషాలు వ్యవథి గల విక్రాంత్ రోణ‌ స్నీక్‌ పీక్‌ను బుర్జ్‌ఖలీఫా భవంతిలో విడుదల చేసిన వేడుక చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వేడుకలో టైటిల్‌ లోగోను కూడా విడుదల చేశారు. ఈ వేడుక కోసం సుదీప్‌ 2000 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఎత్తున్న కటౌట్‌తో  సూపర్‌స్టార్‌ సుదీప్‌ ఓ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 

జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన విక్రాంత్ రోణ‌ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్‌ చేశారు. అలంకార్‌ పాండియన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్‌.జె ప్రొడక్షన్‌ డిజైననర్‌గా వ్యవహరించారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో ..50 దేశాల్లో విక్రాంత్ రోణ చిత్రం విడుదలవుతుంది.

Today Movie Updates:

Today Movie News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ