Advertisementt

షార్ట్ ఫీమ్స్ హీరోగా నిలబెట్టాయి -కిరణ్ అబ్బవరం

Thu 04th Feb 2021 07:47 PM
s.r. kalyanamandapam movie,hero kiran abbavarapu,  షార్ట్ ఫీమ్స్ హీరోగా నిలబెట్టాయి -కిరణ్ అబ్బవరం
S.R. Kalyanamandapam Teaser Released! షార్ట్ ఫీమ్స్ హీరోగా నిలబెట్టాయి -కిరణ్ అబ్బవరం
Advertisement
Ads by CJ

ఎస్.ఆర్. కల్యాణమండపం టీజర్ విడుదల!

శ్రీధర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం  టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో సింహ కోడూరి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..

మా మొదటి ప్రయత్నం రాజవారు రాణిగారు సక్సెస్ చేశారు. మా రెండో సినిమా ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా టీజర్ బాగుందని అందరూ అంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా ప్రేత్యేకంగా ఉంటుంది. ఆర్ట్, కెమెరా, మ్యూజిక్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ వారు బాగా సపోర్ట్ చేశారు. కరోన సమయంలో కూడా అందరూ టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. వన్ విజన్ ప్రొడక్షన్ పర్వతనేని రాంబాబు నిర్మాతగా ఎన్నో షాట్ ఫిలింస్ చేసిన నేను ఈ స్థాయికి వచ్చాను. నాలాంటి కొత్తవారికి ఇలాంటి సహకారం అందించడం నిజంగా మర్చిపోలేను. నేను వీలైనంత మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరిని అలరించబోతుందని నమ్ముతున్నాను అన్నారు.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..

కిరణ్ అబ్బవరం కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన ప్రయత్నానికి మనం అందరూ సపోర్ట్ చెయ్యాలి. మనం ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తే ఇలాంటి ట్యాలెంటెడ్ నటులు బయటికి వస్తారు. ఒక మంచి కథతో ఎస్.ఆర్.కల్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సినిమాను విష్ చెయ్యడం నాకు హ్యాపిగా ఉంది. అందరికి మంచి హస్పెటాలిటీ కల్పించి ఈ ఎలైట్ బ్యానర్ సినిమాను కంప్లీట్ చేశారు. వీరు ఇలాంటి మంచి సినిమాలో మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సింహ కోడూరి మాట్లాడుతూ..

సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎనిర్జీతో కంప్లీట్ చేశారు. అదే ఎనర్జీ మీరు కంటిన్యూ చెయ్యాలి. కిరణ్ అబ్బవరం గారు మీరు చాలా మందికి ఇంస్పిరేషన్, కొత్తగా వచ్చే నటులు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఎలైట్ బ్యానర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. ఈ మూవీ హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న, యూనిట్ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

S.R. Kalyanamandapam Teaser Released!:

S.R. Kalyanamandapam movie teaser released!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ