Advertisementt

మై నేమ్ ఈజ్ రాజు.. చావు క‌బురు చ‌ల్ల‌గా!

Sun 07th Feb 2021 08:33 PM
chaavu kaburu challaga movie,march 19th release  మై నేమ్ ఈజ్ రాజు.. చావు క‌బురు చ‌ల్ల‌గా!
Chaavu Kaburu Challaga first Song Released మై నేమ్ ఈజ్ రాజు.. చావు క‌బురు చ‌ల్ల‌గా!
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు యంగ్ హీరో కార్తికేయ చావు క‌బురు చ‌ల్ల‌గా  చిత్రం నుంచి మొద‌టి పాట మై నేమ్ ఈజ్ రాజు విడుద‌ల.‌‌

మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ బ‌స్తి బాల‌రాజు ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాను మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన‌ మై నేమ్ రాజు అంటూ సాగే బ‌స్తీ బాలారాజుగా హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్ తాజాగా విడుద‌లైంది.  ఈ సాంగ్ ని రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యాన్ని అందించారు. ఈ  సినిమాలో బ‌స్తీబాలరాజు అనే క్యారెక్ట‌ర్ లో కార్తికేయ లుక్స్ కి, నేప‌థ్యానికీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా సినీ అభిమానుల్ని కచ్ఛితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్రం బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమాను అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్ల‌పాటి సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ బ‌స్తీబాల‌రాజు క్యారెక్ట‌ర్ వీడియో,‌ టీజ‌ర్ గ్లింప్స్ ద్వారా ఆ విష‌యం స్ప‌ష్టం అవుతుంది. ఇప్పుడు వ‌చ్చిన ఫ‌స్ట్ సింగ్ సాంగ్ మై నేమ్ ఈజ్ రాజు కూడా సినీ అభిమానుల్ని అల‌రిస్తోంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ఇటు పాట‌లుకి అద్భుత‌మైన ట్యూన్స్ ఇస్తూనే అటు నేప‌థ్య సంగీతానికి పెద్ద పీఠ వేస్తూ చ‌క్క‌టి అవుట్ పుట్ ఇస్తున్నారు. జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో 100% ల‌వ్, భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీతగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని అన్నారు.

Chaavu Kaburu Challaga first Song Released:

Chaavu Kaburu Challaga first song My Name Is Raju was released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ