Advertisementt

P3 పటారుపాలెం ప్రేమకథ ట్రైలర్ రిలీజ్.!

Sun 14th Feb 2021 04:08 PM
p3 pataru paalyam prema katha movie,p3 pataru paalyam prema katha,p3 pataru paalyam prema katha trailer launch  P3 పటారుపాలెం ప్రేమకథ ట్రైలర్ రిలీజ్.!
P3 Pataru Paalyam Prema Katha Trailer Launch P3 పటారుపాలెం ప్రేమకథ ట్రైలర్ రిలీజ్.!
Advertisement
Ads by CJ

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి  దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పటారుపాళెం ప్రేమ కథ శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాంగ్స్, టీజర్ లా ఇప్పుడు విడుదల అయిన ఈ ట్రైలర్ ఈ సినిమా కథ పట్ల సర్వత్రా ఆసక్తి రేపుతుంది. కాగా ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా సినిమా మిర్యాలగూడ ప్రణయ్ అమృత అండ్ హేమంత్ అవంతిక కథ అంటూ, అలానే వేరే వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వాటికి అతి త్వరలో మేమె ఒక సమాధానం చెప్తాము అని అన్నారు. కాగా ఈ సినిమా గురించి, ఈ సినిమా కథ అదే అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చాలా వెలువడిన సంగతి మనకు తెలిసిందే.  

అయితే ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి. వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జె.ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని, పరువుహత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది, అతి త్వరలో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

P3 Pataru Paalyam Prema Katha Trailer Launch:

P3 Pataru Paalyam Prema Katha Trailer Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ