Advertisementt

అఖిల్ తెలుగు - మోనాల్ గుజరాతీ

Mon 15th Feb 2021 01:30 PM
telugu abbai gujarati ammayi first look poster launch  అఖిల్ తెలుగు  - మోనాల్ గుజరాతీ
Telugu Abbai Gujarati Ammayi first look poster launch అఖిల్ తెలుగు - మోనాల్ గుజరాతీ
Advertisement
Ads by CJ

వాలంటైన్స్ డే కానుకగా తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!

బిగ్ బాస్ సీజన్- 4 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకున్న జంట అఖిల్, మోనాల్ గజ్జర్.. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య ఉన్న, స్నేహం, లవ్, రిలేషన్స్ కి సెపరేట్ అభిమానులు ఏర్పడ్డారు. అంతలా అఖిల్, మోనాల్ గజ్జర్ లు  మంచి పేరు తెచ్చుకున్నారు.  ఇప్పుడు వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో సరస్వతీ క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఎ. భాస్కర్ రావు తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న  ప్రేమికుల దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో   ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, హీరోయిన్ మోనాల్ గజ్జర్, దర్శకుడు భాస్కర్ బంటుపల్లి, నిర్మాత ఏ.భాస్కరరావు పాల్గొన్నారు.. 

దర్శకుడు భాస్కర్ బంటుపల్లి మాట్లాడుతూ.. బిగ్ బాస్-4లో అఖిల్, మోనాల్ పెయిర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. వాళ్ళిద్దరితో సీనిమా చేస్తే బాగుంటుందని నా మిత్రుడు సలహా ఇచ్చాడు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. వెంటనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఒక లైన్ అనుకున్నాను. అది మా ప్రొడ్యూసర్ గారికి చెప్పగానే ఆయన వెంటనే ఒకే అన్నారు. తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి ఈ టైటిల్ మన తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు. పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ ఇది. గుజరాత్ నుండి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి.. విల్లేజ్ నుండి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టొరీ. మార్చ్ నుండి ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాం.. అన్నారు. 

నిర్మాత ఎ. భాస్కర్ రావు మాట్లాడుతూ.. బేసిగ్గా నేను డాక్టర్ ని. బిగ్ బాస్-4 సీజన్ అంతా మిస్ అవకుండా చూశాం. మా ఫ్యామిలీ అంతా బాగా కనెక్ట్ అయ్యారు. అఖిల్, మోనాల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని అనుకునే టైంలో భాస్కర్ వచ్చి మంచి స్టోరీ చెప్పాడు. చాలా ఎక్సయిట్ అయ్యాను. వెరీ షార్ట్ టైంలో ఈ ప్రాజెక్టు ఒకే అయింది. ఆరు పార్ట్ లుగా ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేశాం.. మార్చ్ సెకండ్ వీక్ నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.. అన్నారు. 

అఖిల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో మోనాల్ నేను ఎలా అయితే క్లోజ్ గా ఫ్రెండ్లిగా, లవ్, ఎమోషనల్ గా ఉన్నామో అదంతా వెబ్ సిరీస్ ద్వారా క్లియర్ గా ఆన్సర్ చెప్పబోతున్నాం. టౌన్ నుండి వచ్చిన  ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి   సాఫ్ట్ వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి ఎన్ని స్త్రగుల్స్ ఫేస్ చేశాడు.. అనుకోకుండా ఒక గుజరాతీ అమ్మాయిని కలిసి ఎలా లవ్ లో పడ్డాడు అనేది.. మెయిన్ కాన్సెప్ట్. ప్రాపర్ వెబ్ సిరీస్ ఇది. ఈ కథ మా ఇద్దరికీ బాగా సింక్ అయింది. పర్ఫెక్ట్ టైటిల్. ఇద్ నాకు ఫస్ట్ ప్రాజెక్టు.. ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ రావు గారికి నా థాంక్స్.. అన్నారు. 

మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ.. గుజరాత్ నుండి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడింది.. ఇక్కడ ఎలా అడ్జెస్ట్ అయింది.. అనేది నా క్యారెక్టర్. బిగ్ బాస్ లో మా ఇద్దరికీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.  తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి అనేది ఆడియెన్స్ నుండి వచ్చిన టైటిల్. ఈ వెబ్ సిరీస్ కి సూపర్ గా యాప్ట్ అయింది. అది అఖిల్, నేను చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు. 

సరస్వతీ క్రియేషన్స్ బ్యానర్లో మాస్టర్ అజితేష్ వెంకట్ సమర్పణలో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ కి డివోపి; ఎడి మార్గల్, సంగీతం; సాకేత్ కోమండూరి, పీఆర్ఓ; సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, నిర్మాత; ఎ. భాస్కర్ రావు, రచన-దర్శకత్వం; భాస్కర్ రావు బంటుపల్లి.

Telugu Abbai Gujarati Ammayi first look poster launch:

Telugu Abbai Gujarati Ammayi first look poster launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ