Advertisementt

ఫాన్సీ రేటు కి 'క్లూ'

Sun 21st Feb 2021 06:37 PM
clue movie,clue movie hindi rights,  ఫాన్సీ రేటు కి 'క్లూ'
Clue Movie Coming Soon ఫాన్సీ రేటు కి 'క్లూ'
Advertisement
Ads by CJ

ఫాన్సీ రేటు కి అమ్ముడు పోయిన 'క్లూ' సినిమా హిందీ రైట్స్..!

ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా మార్కెట్ లో టాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నా సినిమా బాగుంటేనే కానీ హిందీ రైట్స్ కొనే పరిస్థితీ లేదు. అలాంటిది కేవలం ట్రైలర్ చూసి భారీ ధరకు హిందీ రైట్స్ అమ్ముడయినా సినిమా క్లూ.. పలు పెద్ద సినిమాలకు, హీరోలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన పృద్వి శేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సబీనా జాస్మిన్ హీరోయిన్ గా నటిస్తుంది. రమేష్ రాణా దర్శకత్వం వహిస్తున్నారు.. అప్సర్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. యస్ అండ్ యమ్ క్రియేషన్స్ పతాకంపై సుబాని అబ్దుల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం హిందీ హక్కులు భారీ రేటు పలకడంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులలో క్యూరియాసిటి ఏర్పరిచిన సినిమా టీజర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవలే విడుదలయిన ట్రైలర్  సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసుకుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాని త్వరలోనే రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

నటీనటులు: పృద్వి శేఖర్, సబీనా జాస్మిన్, శుభాంగి పంత్, సంజన నాయుడు, శియాజీ షిండే, మధు నారాయణన్, రాజా రవీంద్ర, జీవా మరియు దేవ్ గిల్ తదితరులు.

సాంకేతిక నిపుణులు: ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్లు: షావోలిన్ మల్లేష్, కుంగ్ ఫు శేఖర్, నృత్యం: అనీష్, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, స్క్రీన్ ప్లే: డైలాగ్స్: అప్సర్, కెమెరా: శ్రీనివాస్ సబ్బి, ఎడిటర్: సాయి భరద్వాజ విప్పర్తి, దర్శకత్వం: రమేష్ రాణా, నిర్మాత: సుబాని అబ్దుల్.

Clue Movie Coming Soon:

Clue movie Hindi rights to fancy rate.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ