యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' ఫస్ట్ లుక్ కి విశేష స్పందన
కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యానర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
నటీనటులు: సంతోష్ శోభన్.
టెక్నికల్ టీమ్: దర్శకుడు: కార్తీక్ రాపోలు, నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, కథ: మేర్లపాక గాంధీ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, ఎడిటర్: సత్య, పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్.