కింగ్ నాగార్జున, ప్రవీన్ సత్తారు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్.
కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుదర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ స్టైలిష్ యాక్షన్ ఫిలింలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటిస్తూ..నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ డ్రామాలోకి కాజల్‌ను స్వాగతిస్తున్నాం అని స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ గోవా, హైదరాబాద్, ఊటీ, లండన్‌లలో జరపడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - టాలీవుడ్‌లో నాకు చాలా అద్భుతమైన సమయం. నేను తొలిసారిగా నాగార్జున గారితో కలిసి నటించబోతున్నాను. ఇప్పటివరకూ నా కెరీర్‌లో పోషించనటువంటి ఒక ప్రత్యేకమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు అంటే విపరీతమైన ఇష్టం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయనతో కలిసి పనిచేయడం సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది అన్నారు.