Advertisementt

విష్వ‌క్ సేన్ తో నివేదా

Thu 18th Mar 2021 04:47 PM
nivetha pethuraj,theera,paagal movie,vishwak sen paagal,vishwak sen,paagal releasing on may 1st  విష్వ‌క్ సేన్ తో నివేదా
Introducing Nivetha Pethuraj As Theera In Vishwak Sen Paagal విష్వ‌క్ సేన్ తో నివేదా
Advertisement
Ads by CJ

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వ‌క్ సేన్ యూత్ ఆడియెన్స్‌లో క్ర‌మంగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న యూత్‌ను ఎట్రాక్ట్ చేసే స్క్రిప్టుల‌ను ఎంచుకుంటున్నారు. ఆ వ‌రుస‌లో వ‌స్తున్న ఆయ‌న లేటెస్ట్ ఫిల్మ్ పాగ‌ల్‌. ఈ మూవీపై యూత్‌పై మంచి బ‌జ్ నెల‌కొంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, టైటిల్ సాంగ్‌కు ఎక్స‌లెంట్ రెస్పాన్స్ ల‌భించింది.

డైరెక్ట‌ర్ న‌రేష్ కుప్పిలి మ్యాజిక‌ల్ ల‌వ్ స్టోరీగా పాగ‌ల్‌ను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే సిమ్ర‌న్ చౌద‌రి, మేఘ‌లేఖ హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో నాయిక‌గా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా పేతురాజ్ పేరును ఎనౌన్స్ చేశారు. తీర అనే పాత్ర‌ను నివేదా పోషిస్తున్న‌ట్లు గురువారం ఓ పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు. ఆ పోస్ట‌ర్‌లో హీరో విష్వ‌క్ సేన్ రెండు చేతులు వెన‌క్కి పెట్టి ఉన్నాడు. నివేదా పేతురాజ్ ఆయ‌న‌ను హ‌త్తుకొని ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌య‌మేమంటే విష్వ‌క్ సేన్ చేతులు రెండూ క‌లిపి క‌ట్టేసి ఉన్నాయి. విడుద‌ల చేసిన కొద్ది సేప‌ట్లోనే ఈ పోస్ట‌ర్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది.

మే 1న పాగ‌ల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

ఎస్‌. మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ర‌ధ‌న్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు.

Introducing Nivetha Pethuraj As Theera In Vishwak Sen Paagal:

Introducing Nivetha Pethuraj As Theera In Vishwak Sen Paagal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ