నిన్నటివరకు పుష్ప పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ (పుష్ప రాజ్) పాత్రని ఢీ కొట్టబోయేది ఎవరు అంటూ అనేకరకాల చర్చలు, అనేక రకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అదే రకమయిన సస్పెన్స్ ని పుష్ప టీం బాగా మెయింటింగ్ చేసింది. చివరి వరకు పుష్ప విలన్ ని ఎవరు గెస్ చెయ్యలేని పేరుని ప్రకటించింది. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ ని పుష్ప రాజ్ పాత్రని ఢీ కొట్టబోయే విలన్ పాత్రకి టాలీవుడ్ కి పరిచయం చెయ్యబోతున్నారు. పాన్ ఇండియా మూవీలో పరభాషా నటులు పెట్టడం కొత్తకాదు. కానీ ఎవరూ ఊహించని పేరు తెరపైకి రావడంతో అందరూ నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు. మలయాళంలో మంచి ఫేమ్ ఉన్న నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప విలన్ గా అంటే మంచి క్రేజ్ రావడం ఖాయం.
అయితే ఇప్పుడు పుష్ప విలన్ రెమ్యునరేషన్ న్యూస్ లు మొదలైపోయాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతికి భారీగా పారితోషకం ఇచ్చే పుష్ప కోసం తీసుకొచ్చారు. కానీ విజయ్ పుష్ప మొదలవకముందే వెళ్లిపోవడంతో.. ఇప్పడు మలయాళ నటుడు ఫాజిల్ ని తీసుకున్న అతని రేంజ్ కి తగినట్లుగా పారితోషకం ఫిక్స్ చేశారట పుష్ప మేకర్స్. పుష్ప విలన్ కేరెక్టర్ చెయ్యడానికి ఫాహద్ ఫాజిల్ కి 5 కోట్ల పారితోషకం ఆఫర్ చేశారనే న్యూస్ బయటికి వచ్చింది. నేషనల్ అవార్డు గ్రహీత ఫాజిల్ కి ఐదు కోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ ఫాజిల్ కి మాత్రం పుష్ప మేకర్స్ 5 కోట్లు రెమ్యునరేషన్ కి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట.