Advertisementt

రౌడీ బేబీ కాస్తా గ‌ల్లీరౌడీగా మారింది

Thu 25th Mar 2021 05:24 PM
sundeep kishan,rowdy baby movie title,changed,galli rowdy movie  రౌడీ బేబీ కాస్తా గ‌ల్లీరౌడీగా మారింది
Sundeep Kishan Rowdy Baby title Changed రౌడీ బేబీ కాస్తా గ‌ల్లీరౌడీగా మారింది
Advertisement
Ads by CJ

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా కాంబినేషన్‌లో సందీప్ కిష‌న్ హీరోగా రూపొందుతోన్న చిత్రానికి టైటిల్ మార్పు.. గ‌ల్లీరౌడీగా టైటిట్ ఫిక్స్

కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూతనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న యువ  హీరో  సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కొన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా ఈ సినిమా టైటిల్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మార్చారు. ఇప్పుడీ చిత్రానికి గ‌ల్లీరౌడీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా ..బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ గల్లీ రౌడీ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరిస్తున్నారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ గల్లీ రౌడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫ‌న్ రైడ‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది. 

Sundeep Kishan Rowdy Baby title Changed :

Sundeep Kishan Rowdy Baby title Changed as Galli Rowdy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ