కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆదిరెడ్డి. టి సమర్పణ లో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ ఇందులో కథానాయిక. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ-ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో కార్తికేయ ఎన్. ఐ. ఎ. ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్ ఎనర్జీ తో ఉంటుంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘కరుప్పన్’ లో నటించి, ప్రస్తుతం అదర్వ మురళి తో చేస్తున్న తాన్యా రవిచంద్రన్ ని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు ఆమె. మంచి క్లాసికల్ డాన్సర్. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. మెంటల్ మధిలో, దొరసాని,అంతరిక్షం చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్. ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం అని చెప్పారు.
నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. సూపర్ స్క్రిప్ట్ ఇది. కార్తికేయ పాత్ర చిత్రణ చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికీ సగం సినిమా పూర్తైయింది. ఈ నెలాఖరు వరకు హైదరాబాదులో జరిపే షెడ్యూల్ తో 90 శాతం పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లి లో చిత్రీకరిస్తాం అని తెలిపారు.